
- వైట్ హౌస్ మీటింగ్‌పై ఎలాన్ మస్క్ కామెంట్
వాషింగ్టన్: వైట్ హౌస్ మీటింగ్, విందుకు తనకూ ఆహ్వానం అందిందని స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. హాజరయ్యేందుకు ప్రయత్నించినా దురదృష్టవశాత్తూ కుదరలేదని వివరించారు. దీంతో తన తరఫున ఓ ప్రతినిధిని పంపించానని మస్క్ వివరణ ఇచ్చారు. టెక్ దిగ్గజాలతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రముఖ వ్యాపారవేత్త, ట్రంప్ మాజీ సలహాదారు ఎలాన్ మస్క్ కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
ఇటీవలి కాలంలో ఇద్దరి మధ్య నెలకొన్న విభేదాల కారణంగా మస్క్ ను ట్రంప్ ఆహ్వానించలేదని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ మీటింగ్‌కు ఎలాన్ మస్క్ ను ట్రంప్ పిలవలేదంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేయగా.. మస్క్ స్పందించారు. "వైట్ హౌస్ విందుకు నాకూ ఆహ్వానం అందింది. అయితే, వెళ్లడం కుదరలేదు. దీంతో నా తరపున ప్రతినిధిని పంపించాను" అని మస్క్ వివరించారు. కాగా, శుక్రవారం వైట్ హౌస్‌లో టెక్ దిగ్గజాల సమావేశం జరిగింది. ట్రంప్ ఆహ్వానం మేరకు దీనికి పలువురు ప్రముఖ సిలికాన్ వ్యాలీ సీఈఓలు, టెక్ లీడర్లు అటెండ్ అయ్యారు.