
న్యూఢిల్లీ: పిల్లల కోసం బేబీ గ్రోక్ యాప్‌ను తీసుకురానున్నట్టు ఎక్స్ ఏఐ సీఈవో ఎలాన్ మస్క్ ప్రకటించారు. ‘‘మేం బేబీ గ్రోక్‌ను రూపొందించనున్నాం. ఈ యాప్‌లో పిల్లల కోసం ప్రత్యేకమైన కంటెంట్ ఉంటుంది” అని సోషల్ మీడియాలో ‘ఎక్స్’లో శనివారం ఆయన పోస్టు పెట్టారు. ఈ యాప్‌లో కేవలం కిడ్స్ ఫ్రెండ్లీ కంటెంట్ మాత్రమే ఉండనుంది.