15 వందల మందితో ట్విట్టర్ ఎలా నడుస్తుంది.. ఎలన్ మస్క్ చెప్పిన సీక్రెట్స్ ఏంటీ

15 వందల మందితో ట్విట్టర్ ఎలా నడుస్తుంది.. ఎలన్ మస్క్ చెప్పిన సీక్రెట్స్ ఏంటీ

ట్విట్టర్.. ప్రపంచాన్ని శాసిస్తున్న సోషల్ ప్లాట్ ఫామ్స్ లో ఒకటి.. ఒక్క ట్విట్ తో అగ్గి పుట్టిస్తుంది.. అదే ఒక్క ట్విట్ తో చల్లార్చుతుంది.. గేమ్ ఛేంజర్ గా ఉన్న ట్విట్టర్ లో ప్రస్తుతం.. ప్రపంచ వ్యాప్తంగా ఎంత మంది ఉద్యోగులు పని చేస్తున్నారో తెలుసా.. అక్షరాల 15 వందల మంది.. అవును.. తెలుగు న్యూస్ చానెల్స్, పత్రికల్లో ఇంత కంటే ఎక్కువ మంది పని చేస్తారు కదా.. మరి ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్ లో 15 వందల మందేనా పని చేసేది.. అది ఎలా సాధ్యం అనే డౌట్స్ రావొచ్చు.. ఇలాంటి డౌట్స్ కు ఎలన్ మస్క్ చెప్పిన సమాధానమే.. ఇప్పుడు అన్ని ఐటీ కంపెనీల్లో లే ఆఫ్స్ కు కారణం అయ్యింది. అది ఎలాగో చూద్దాం...

ఎలన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలు చేయక ముందు 8 వేల 500 మంది ఉద్యోగులు పని చేసేవారు.. ట్విట్టర్ టేకోవర్ తర్వాత తీసువేతలు, వెళ్లిపోవటాలు అన్ని పూర్తయిన తర్వాత.. ప్రస్తుతం 15 వందల మంది ఉద్యోగులతోనే నడిపిస్తున్నాడు. ప్రధానంగా ఇంజినీరింగ్, కొత్త ట్రెండ్స్ అప్ డేట్ చేయటంపైనే దృష్టి పెట్టాం.. పబ్లిక్ రిలేషన్స్, హెచ్ఆర్ విభాగాల్లో 90 శాతం కోత పెట్టాం.. దీని వల్ల కంపెనీకి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు.. ప్రస్తుతం ట్విట్టర్ బాగా పని చేస్తుంది.. గతంలో 8 వేల 500 మంది ఉద్యోగులు ఉన్నా.. సంవత్సరాల తరబడి కొత్త ఉత్పత్తులు జరగలేదు.. ఆ దిశగా కేవలం ఆలోచనలు మాత్రమే ఉన్నాయి.. మేం వచ్చిన తర్వాత ఉపయోగం లేని.. మార్కెటింగ్ లేని.. పని చేయని వాళ్లను తొలగించాం.. కొంత మంది వాళ్లకు వాళ్లుగా వెళ్లిపోయారు అని చెప్పుకొచ్చాడు ఎలన్ మాస్క్.. 

పాత యాజమాన్యం ఇంత మంది ఉద్యోగులను నియమించుకుని.. ఒక కొత్త ప్రాడెక్ట్ కూడా ఎందుకు తీసుకురాలేకపోయిందో అర్థం కావటం లేదు.. నేను కార్ల కంపెనీని నడపటం లేదు.. నా కార్ల కంపెనీలో కూడా ఇంత మంది లేదు.. అలాంటిది సోషల్ ఇంజినీరింగ్ యాప్ లో ఇంత మంది ఎందుకు అనేది నాకు వచ్చిన ప్రధానమైన ఆలోచన.. అందుకు తగ్గట్టుగానే తొలగించాం.. ఈ క్రమంలో 40 శాతం అడ్వర్టైజ్ ఆదాయం కోల్పోయాం అనేది వాస్తవం.. ట్విట్టర్ పున:నిర్మాణంతో పోల్చితే ఇది పెద్ద సమస్య కాదు.. రాబోయే రోజుల్లో ట్విట్టర్ ను పూర్తిగా కమర్షియల్ గా.. మరింత సమర్థవంతంగా.. శక్తివంతంగా తీర్చిదిద్దటానికి ప్రస్తుతం ఉన్న 15 వందల మంది బుర్రలు చాలా చురుగ్గా పని చేస్తున్నాయని వివరించారు ఎలన్ మస్క్..

ఉద్యోగుల తొలగింపులు.. లే ఆఫ్స్ కు మీరే కారణం అని ఐటీ ఉద్యోగులు అంటున్నారు.. మిగతా సీఈవోలకు మార్గదర్శకం అయ్యారనే ప్రచారంపైనా స్పందించారు ఎలన్ మస్క్.. నేను మిగతా సీఈవోలతో అస్సలు మాట్లాడను.. నా రూటే సెపరేట్.. ఒకవేళ వాళ్లు నా దారిలో వెళుతున్నారు అంటే వాళ్లకు సొంత ఆలోచన లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయని చురకలు అంటించారు మస్క్. 

ట్విట్టర్ టేకోవర్ తర్వాత.. ఇప్పటి వరకు నేను ఉద్యోగులతో నేరుగా మాట్లాడలేదు.. నా ఆలోచనలు మాత్రమే చెబుతాను.. అందుకు తగ్గట్టు వారు రిజల్ట్ ఇవ్వాల్సి ఉంటుంది అని వివరించారు మస్క్.  ఏప్రిల్ 20వ తేదీ నుంచి బ్లూ టిక్ అప్ డేట్ వస్తుందని.. డబ్బులు చెల్లించి వెరిఫికేషన్ చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ఉద్యోగుల తొలగింపు ద్వారా ట్విట్టర్ లో సెన్సార్ షిప్ లేకుండా పోయిందని.. దీని వల్ల అశ్లీలత, విద్వేషాలు పెరిగే ప్రమాదం లేకపోలేదనే వాదనలను సైతం కొట్టిపారేశారు మస్క్. దీని కోసం ప్రత్యేక టూల్ తీసుకొస్తున్నామని.. ఉద్యోగులు చేయాల్సిన పనిని అదే చేస్తుందని.. తక్కువ మందితోనూ ఎక్కువ వర్క్ చేయించుకోవచ్చని.. వేల మంది ఉద్యోగులు ముఖ్యం కాదని.. ఎంత మంది బాగా పని చేస్తున్నారు.. ఎంత మంది బుర్ర పెట్టి పని చేస్తున్నారు అనేది సోషల్ మీడియాలో ప్రధానమైన పాయింట్ అన్నారు ఎలన్ మస్క్.. అందుకు తగ్గట్టుగా ఇంజినీరింగ్, ప్రాడెక్ట్ విభాగాలను శక్తివంతం చేస్తున్నట్లు వెల్లడించారు ఎలన్ మస్క్.. 

ఎలన్ మస్క్ లేటెస్ట్ ఇంటర్వ్యూ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయ్యింది. టెక్ కంపెనీల్లో భారీ లేఆఫ్స్ కు కారణం ఎలన్ మస్క్ రూటు వేశారనేది మాత్రం నిజం అంటున్నారు ఐటీ ఉద్యోగులు.. దీని తర్వాత సీఈవో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది ఆసక్తి రేపుతోంది.