ట్విటర్ పక్షికి స్వేచ్ఛ లభించింది : మస్క్

ట్విటర్ పక్షికి స్వేచ్ఛ లభించింది : మస్క్

ట్విట్టర్ను సొంతం చేసుకున్న ఎలాన్ మస్క్ మరోసారి వార్తల్లో నిలిచారు. కొన్నాళ్లుగా అనేక మలుపు తిరిగిన ట్విట్టర్ డీల్ పూర్తైన అనంతరం మస్క్ తొలి ట్వీట్ చేశారు. పక్షికి స్వేచ్ఛ లభించిందంటూ ఆయన చేసిన ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది. ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్, లీగర్ అఫైర్స్ చీఫ్ విజయ గద్దెను పదవుల నుంచి తొలగించిన అనంతరం మస్క్ ఈ ట్వీట్ చేశారు.

మరోవైపు ట్విటర్ కొనుగోలు తుది నిర్ణయంపై సుప్రీంకోర్టు ఇవాళ్టి వరకు గడువు విధించింది. దీంతో ఎలాన్ మస్క్ ఇటీవల.. 13 బిలియన్ డాలర్ల రుణాల కోసం బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు.  తర్వాత ట్విట్టర్ ప్రధాన కార్యాలయానికి వెళ్లి చర్చలు జరిపి.. ట్విట్టర్ ను సొంతం చేసుకున్నారు. మరోవైపు 75 శాతం ఉద్యోగుల్ని తొలగిస్తామంటూ వచ్చే వార్తల్లో వాస్తవం లేదని ఆయన చెప్పారు. అటు మస్క్ కు అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ శుభాకాంక్షలు తెలిపారు. తన ట్విట్టర్ అకౌంట్ రీ ఓపెన్ అవుతుందన్న ఆశతో ఉన్నట్లు సంకేతం ఇచ్చారు. ఇక ట్వీట్టర్ ను తన ఆధీనంలోకి తీసుకున్న ఎలాన్ మస్క్.. సీఈవో పరాగ్ అగర్వాల్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నెడ్ సెగల్,లీగల్ అఫైర్స్ అండ్ పాలసీ చీఫ్ విజయ గద్దెను విధుల నుంచి తొలగించిన విషయం తెలిసిందే.