కీవ్: ‘యుద్ధ తీవ్రత పెరుగుతోంది..దాడులు ముమ్మరమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడు ఉక్రెయిన్ వదిలివెళ్లండి’ అంటూ ఆ దేశంలో ఉన్న మన దేశస్తులను ఇండియన్ ఎంబసీ హెచ్చరించింది. ఏ వాహనం దొరికితే దానిని పట్టుకుని ఉన్న పళంగా దేశం దాటాలని సూచించింది. బార్డర్ దాటేందుకు సాయం కావాలంటే ఎంబసీకి ఫోన్ చేయాలని పేర్కొంది. ఉక్రెయిన్ సిటీలు అన్నింటిపైనా దాడులు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని ఎంబసీ అధికారులు మరోసారి హెచ్చరించారు. ఉక్రెయిన్ లోని పలు సిటీలలో ఇప్పటికీ మనోళ్లు ఉన్నారు. యుద్ధం ప్రారంభమైన కొత్తలో మన దేశానికి వచ్చిన స్టూడెంట్లలో కొందరు రెండు నెలల క్రితం మళ్లీ వెళ్లారు.
