
- ఉక్రెయిన్ – రష్యా ఉద్రిక్తతల మధ్య కీలక నిర్ణయం
ఉక్రెయిన్: ఉక్రెయిన్ లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. రష్యా- ఉక్రెయిన్ ల మధ్య కొన్ని వారాలుగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం తప్పకపోవచ్చని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. ఇప్పటికే లక్షకు పైగా రష్యా సైనికులు ఉక్రెయిన్ సరిహద్దుల్లో మోహరించి ఉన్నారు. మరోవైపు ఉక్రెయిన్ లో రష్యా అనుకూల తిరుగుబాటుదారులు, ఉక్రెయిన్ సైన్యానికి మధ్య కాల్పులు జరుగుతున్నాయి. నిన్న ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసరంగా సమావేశమయి రష్యా- ఉక్రెయిన్ పరిణామాలపై చర్చించింది.
ఇదిలా ఉంటే ఉక్రెయిన్ తాజాగా జాతీయ ఎమర్జెన్సీని ప్రకటించింది. రష్యా నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఉక్రెయిన్ భద్రతా మండలి జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఉక్రెయిన్ లోని డోనెట్స్క్ మరియు లుహాన్స్క్ ప్రాంతాలు కాకుండా మిగతా ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితిని విధించారు. అత్యవసర పరిస్థితి 30 రోజుల పాటు కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండిః