మా శారద హాస్పిటల్​లో ఎమర్జెన్సీ వార్డు ప్రారంభం

మా శారద హాస్పిటల్​లో ఎమర్జెన్సీ వార్డు ప్రారంభం

వికారాబాద్, వెలుగు : మా శారద హాస్పిటల్ యాజమాన్యం పేద ప్రజలకు రాయితీతో కూడిన వైద్య సేవలు అందించడం అభినందనీయమని వికారాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సున్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం నిర్వహించిన హాస్పిటల్ 4వ వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్నారు. 

ఎమర్జెన్సీ వార్డును ప్రారంభించారు. ఉన్నత ఆశయాలతో డాక్టర్ కొప్పుల రాజశేఖర్ వికారాబాద్ లో హాస్పిటల్​పెట్టారని కొనియాడారు. గుంటూరు మాతాజీ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి, ప్రముఖ వక్త భాస్కరయోగి, బీజేపీ కోఆర్డినేటర్ వడ్ల నందు తదితరులు పాల్గొన్నారు.