అత్యంత ఎత్తైన బూర్జ్‌ ఖలీఫాపై ఎమిరేట్స్‌ యాడ్‌

 అత్యంత ఎత్తైన బూర్జ్‌ ఖలీఫాపై ఎమిరేట్స్‌ యాడ్‌

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా రికార్డు నెలకొల్పింది బూర్జ్‌ ఖలీఫా. దీని ఎత్తు 828 మీటర్లు. మామూలుగా అయితే బూర్జ్ ఖలీఫా టాప్ కి ఎవరికి అనుమతి లేదు.. అత్యంత ధైర్యసహసాలు కలిగిని వారికి మాత్రమే ఇక్కడ అనుమతి ఉంటుంది. లేటెస్టుగా ఎమిరేట్స్‌ మిమానయాన సంస్థ బూర్జ్‌ ఖలీఫా టాప్ లో ఓ యాడ్ ని షూట్ చేసి..సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది. ఈ యాడ్‌లో ఎయిర్‌ హోస్టెస్‌ నిల్చుని… ఎమిరేట్స్‌ విమానాల్లో దుబాయ్‌ రావాలంటూ ప్లకార్డులు పట్టుకుని ఆహ్వానం పలుకుతుంది. చివరల్లో ఒక్కసారిగా కెమెరా జూమ్‌ అవుట్‌ అవగానే భూమి నుంచి 828 మీటర్ల ఎత్తులో కేవలం మీటరు స్థలం ఉన్న ఒక చిన్న పలకపై ఆ ఎయిర్‌ హోస్టెస్‌ నిల్చుని ఉన్న విజువల్ కనిపిస్తుంది. ఆకాశంలో నిలబడి ఆకాశయానికి ఆహ్వానం పలుకుతున్నట్టుగా యాడ్‌ ఆకట్టుకుంటుంది. అయితే ఈ యాడ్‌ నిజం కాదంటూ అనుమానాలు వచ్చాయి. దీంతో ఈ యాడ్‌కి సంబంధించి వివరాలను ఎమిరేట్స్‌ ఎయిర్‌లైన్‌ తెలిపింది.


ఈ అడ్వర్‌టైజ్‌మెంట్‌ని చూసినవారంతా యాడ్‌ బాగుందని మెచ్చుకన్నప్పటికీ .. అంత ఎత్తులో షూటింగ్ చేయడం ప్రమాదకరమని.. ఎయిర్‌ హోస్టెస్‌ ఏమైనా అయ్యుంటే పరిస్థితి ఏంటని అందరూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఈ యాడ్‌ షూట్‌కి సంబంధించిన వీడియో ఫుటేజీని ఎమిరేట్స్‌ విడుదల చేసింది. ఈ యాడ్ కోసం నెలల తరబడి రిహార్సల్‌ నిర్వహించింది ఎమిరేట్స్‌. యాడ్‌లో ఎయిర్‌హోస్టెస్‌గా కనిపించిన స్మిత్‌ లుడ్‌విక్‌కి స్పెషల్ ట్రైనింగ్ ఇప్పించింది. భద్రతాపరమైన అన్ని చర్యలు తీసుకునే ఈ యాడ్‌ షూట్‌ చేశామంటూ ఎమిరేట్స్‌ వీడియో రిలీజ్‌ చేసింది.