భర్తకు దుబాయ్​యువరాణి ట్రిపుల్​ తలాక్​​.. ఇన్​స్టాగ్రామ్ లో ప్రకటన

భర్తకు దుబాయ్​యువరాణి ట్రిపుల్​ తలాక్​​.. ఇన్​స్టాగ్రామ్ లో ప్రకటన

న్యూఢిల్లీ: దుబాయ్ యువరాణి షైకా మహ్రా బిన్త్ మహ్మద్​ బిన్ రషీద్ అల్ మక్తూమ్ సంచలన ప్రకటన చేసింది. ఇన్​స్టాగ్రామ్​ సోషల్​ మీడియా వేదికగా తన భర్త షేక్ మనా మహ్మద్ బిన్ రషీద్ బిన్ మనా అల్ మక్తూమ్ కు ట్రిపుల్​ తలాక్​ చెప్పింది. ‘‘ప్రియమైన భర్తకు.. మీరు ఇతరుల సాన్నిహిత్యాన్ని కోరుకుంటున్నందున మీకు నేను విడాకులు ఇస్తున్నాను. ఐ డైవర్స్ యూ.. ఐ డైవర్స్ యూ అండ్​ ఐ డైవర్స్ యూ. టేక్ కేర్.. మీ మాజీ భార్య” అని ఇన్​స్టాలో ఆమె ప్రకటించింది.

ఈ దంపతులకు తొలి సంతానం కలిగిన రెండు నెలలకే ఆమె విడాకుల ప్రకటన చేయడం గమనార్హం. ఇన్​స్టాలో వీళ్లిద్దరూ ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడం, వారు కలిసి దిగిన ఫొటోలను డిలీట్ చేయడంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దుబాయ్​ రాజు షేక్​ మహ్మద్​ బిన్​ రషీద్​ అల్​ మక్తూమ్​ కూతురు షైకా. బ్రిటన్​లో చదువుకున్న ఆమె.. మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్నది. షైకాకు వ్యాపారవేత్త షేక్​ మనా హమ్మద్​ బిన్ మనా అల్​ మక్తూమ్​తో  2023 మే 27న పెండ్లయింది. భర్తకు ఇతర మహిళతో సంబంధాలు ఉన్నాయని తెలిసి ఆమె విడాకులు ప్రకటించింది.