
నౌకరీ డాట్ కామ్ నెలవారీ 'నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్' నివేదిక ప్రకారం, ఐటీ, బీపీఓ లేదా ఐటీఈఎస్, ఎఫ్ఎంసీజీతో సహా రంగాలలో ప్రతికూల ధోరణిని అనుసరించి, సెప్టెంబర్‌లో వైట్ కాలర్ నియామకాలు 8.6 శాతం వార్షిక క్షీణతను చవిచూశాయి. రీసెంట్ గా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. నెలవారీ ఉద్యోగ నియామకాల్లో దాదాపు 6 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు సూచించింది.
సెప్టెంబర్‌లో 2వేల 835 వైట్‌కాలర్ జాబ్ పోస్టింగ్‌లు జరిగాయని, గతేడాది ఇదే నెలలో 3వేల 103 ఉద్యోగాలు పోస్టింగ్‌తో పోలిస్తే 8.6 శాతం తగ్గాయని నెలవారీ నివేదిక హైలైట్ చేసింది. నౌకరీ జాబ్‌స్పీక్, నెలవారీ సూచిక, భారతీయ ఉద్యోగ మార్కెట్ స్థితి, నియామక కార్యకలాపాలను సూచిస్తుంది. నౌకరీ.కామ్ రెజ్యూమ్ డేటాబేస్‌లో రిక్రూటర్‌ల ద్వారా కొత్త జాబ్ లిస్టింగ్‌లు, ఉద్యోగ సంబంధిత శోధనల ఆధారంగా వివరాలను క్లబ్ చేయడం ద్వారా డేటా తయారు చేయబడుతుంది.
ALSO READ : సర్పంచ్ వినూత్న నిరసన.. దెబ్బకు దిగొచ్చిన ప్రభుత్వం
'నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్' నివేదిక ఐటీ రంగం అనేది ప్రపంచ ప్రకంపనలను ఎదుర్కొంటూనే ఉందని, గత కొన్ని నెలల్లో నియామకాల సంఖ్య తగ్గుముఖం పట్టిందని తెలిపింది. పీఓ/ఐటీఈఎస్, ఎఫ్‌ఎంసీజీలు కూడా వరుసగా 25 శాతం, 23 శాతం ప్రతికూల వృద్ధిని నమోదు చేశాయని వెల్లడించింది. ఆయిల్ అండ్ గ్యాస్, ఆటో రంగాలు గతేడాది ఇదే నెలతో పోలిస్తే సెప్టెంబర్‌లో 6 శాతం వృద్ధిని నమోదు చేశాయని నివేదిక తెలిపింది. వడోదర, అహ్మదాబాద్, జైపూర్ నగరాలు గతేడాది ఇదే నెలలో సెప్టెంబర్‌లో నియామకాలలో వరుసగా 4 శాతం, 3 శాతం, 2 శాతం వృద్ధిని సాధించాయి.