టూరిజం సెక్టార్ కళకళ

టూరిజం సెక్టార్ కళకళ

ముంబై: కరోనా వల్ల తీవ్రంగా దెబ్బతిన్న జాబ్​ మార్కెట్​ పుంజుకుంటోంది. ఉద్యోగ నియామకాలు కిందటి ఏడాది మేతో పోలిస్తే ఈసారి మే నెలలో 40శాతం  పెరిగాయి. మహమ్మారి వల్ల నష్టపోయిన టూరిజం సెక్టార్లోనూ హైరింగ్ జోరుగా ఉంది. జాబ్​ పోర్టల్​ నౌకరీ డాట్​కామ్​ స్టడీ రిపోర్టు  ప్రకారం...వేసవి సెలవుల సీజన్‌‌‌‌తో ప్రయాణాలు పెరిగాయి. అందుకే పోయిన నెలలో ట్రావెల్ అండ్ హాస్పిటాలిటీ సెక్టార్‌‌లో నియామకాలు బలంగా ఉన్నాయి.   కరోనావైరస్ మహమ్మారి సెకండ్​ వేవ్​ సమయంలో ప్రయాణాలు విపరీతంగా తగ్గాయి. అందుకే అప్పుడు నియామకాల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ‘‘నౌకరీ జాబ్‌‌స్పీక్ మే22’’ ఇండెక్స్ ప్రకారం,  2022 మేలో నియామకాల్లో 40శాతం యాన్యువల్​ గ్రోత్ కనిపించింది. నౌకరీ జాబ్​స్పీక్​ అనేది నెలవారీ ఇండెక్స్​. ఇది నెలవారీ, ఏడాది ప్రాతిపదికన నౌకరీ డాట్​కామ్​ వెబ్‌‌సైట్‌‌లో జాబ్​పోస్టింగ్స్​ ఆధారంగా నియామక కార్యకలాపాలను రికార్డ్ చేస్తుంది. "పోయిన సంవత్సరం పెద్ద బ్రేక్​ తర్వాత టూరిజం పరిశ్రమ తిరిగి పుంజుకుంది  యానువల్​ గ్రోత్  352 శాతం ఉంది. ఏప్రిల్‌‌తో పోల్చితే ఈ రంగం నిలకడగా ఉంటూ నెలవారీ రన్ రేట్‌‌ను కొనసాగించింది" అని రిపోర్టు పేర్కొంది. ఇతర సెక్టార్లలోనూ ఉద్యోగాలు బాగానే వచ్చాయి. రిటైల్ (175శాతం), రియల్ ఎస్టేట్ (141శాతం)  బీమా సెక్టార్​లో​126శాతం జాబ్స్​ పెరిగాయి. ఐటీ -సాఫ్ట్‌‌వేర్/సాఫ్ట్‌‌వేర్ సేవల పరిశ్రమ అధిక బేస్ ఎఫెక్ట్ కారణంగా ఏడు శాతం పెరుగుదల మాత్రమే కనిపించింది.

చిన్న నగరాల్లోనూ ట్యాలెంట్​కు డిమాండ్

మెట్రోలు  నాన్-మెట్రోలలో ప్రతిభకు డిమాండ్ తగ్గడం లేదు. మేలో నియామకాలలో సంవత్సరం లెక్కన రెండంకెల గ్రోత్​ను సాధించాయి. మెట్రోలలో, ఢిల్లీ (63శాతం) అత్యధిక యాన్యువల్​ గ్రోత్​ ఉంది. ముంబైలో ఇది 61శాతం  రికార్డయింది. ఇతర మెట్రోలు కోల్‌‌‌‌కతా (59శాతం), చెన్నై (35శాతం), పూణే (27శాతం),  హైదరాబాద్​లో (23శాతం) కూడా సానుకూల గ్రోత్​ కనిపించింది. అన్ని టైర్-2 నగరాల్లో నియామకాలు బాగున్నాయి. జైపూర్​లో ట్యాలెంట్​కు డిమాండ్‌‌  76శాతం పెరిగింది. కోయంబత్తూర్ (64శాతం), వడోదర (49శాతం), కొచ్చిన్ (35శాతం), అహ్మదాబాద్ (26శాతం),  చండీగఢ్ (25శాతం)  లో రెండంకెల గ్రోత్​ కనిపించింది.