ఒకప్పుడు వరుస రొమాంటిక్ సినిమాల్లో నటించిన ఇమ్రాన్ హష్మీ.. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ విలన్ రోల్స్‌తో బిజీ అవుతున్నాడు. త్వరలో ‘షో టైమ్’ సిరీస్‌లోనూ విలన్‌గా కనిపించనున్నాడు. అయితే తనకు వరుసగా విలన్ ఆఫర్స్ వస్తుండటంపై రియాక్ట్ అయిన ఇమ్రాన్ హష్మీ.. ‘నేను క్లీన్ క్యారెక్టర్స్ చేయాలనుకుంటా. మొదటి సినిమా నుంచి కావాలని ఏ పాత్రను సెలెక్ట్ చేసుకోలేదు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూనే వచ్చా.
కాలక్రమేణా, ప్రేక్షకులు నన్ను గ్రే షేడ్స్ ఉన్న పాత్రల్లో ఆదరించారు. దీంతో నాకు వరుసగా విలన్ రోల్స్ వస్తున్నాయి. అంతేకానీ కావాలని ఇలాంటి పాత్రలను సెలెక్ట్ చేసుకోవడం లేదు’ అని అన్నాడు. ‘షో టైమ్’లో తను రఘు ఖన్నా పాత్రలో కనిపించనున్నాడు. మహిమా మక్వానా దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో మౌని రాయ్, శ్రియా శరణ్, నసీరుద్దీన్ షా కీలక పాత్రలు పోషించారు. మార్చి 8 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఇది స్ట్రీమింగ్ కానుంది. మరోవైపు పవన్ కళ్యాణ్ ‘ఓజీ’లో, అడివి శేష్ ‘జీ 2’లోనూ ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తున్నాడు.
