ఎములాడ రాజన్నకు రూ.కోటి 59 లక్షల ఆదాయం

ఎములాడ రాజన్నకు రూ.కోటి 59 లక్షల ఆదాయం

వేములవాడ, వెలుగు: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి తొమ్మిది రోజుల్లో భారీగా ఆదాయం సమకూరింది. బుధవారం ఆలయ హుండీలను పోలీసు బందోబస్తు, సీసీ కెమెరాల పర్యవేక్షణలో లెక్కించారు. రూ.1 కోటి 59 లక్షల 52 వేల 901 వందల నగదు, 279 గ్రాముల బంగారం , 14. 7 కిలోల వెండి వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. హుండీ లెక్కింపులో శివరామకృష్ణ భజన మండలి సభ్యులు, ఆలయ సిబ్బంది పాల్గొనగా ఇన్ చార్జ్ ఈఓ రాధాబాయి , ఏసీ ఆఫీసు పరిశీలకులు సత్యనారాయణ , ఏఈఓలు, పర్యవేక్షించారు.