కాశ్మీరీ పండిట్​ను చంపిన టెర్రరిస్ట్​ హతం

కాశ్మీరీ పండిట్​ను చంపిన టెర్రరిస్ట్​ హతం

శ్రీనగర్: కాశ్మీరీ పండిట్ ను చంపిన టెర్రరిస్టును భద్రతా బలగాలు ఇయ్యాల ఎన్​కౌంటర్​లో కాల్చిచంపాయి. హతమైన టెర్రరిస్ట్​ పుల్వామాకు చెందిన అకిబ్​ముస్తాక్​భట్​గా పోలీసులు గుర్తించారు. పుల్వామా జిల్లా అవంతిపొరాలో ఇద్దరు ఉగ్రవాదులు దాక్కున్నట్లు భద్రతా బలగాలకు సమాచారం అందింది. ఇవ్వాల అర్ధరాత్రి1:30 గంటలకు భద్రతా దళాలు ఎన్‌కౌంటర్ స్టార్ట్​చేసి ముస్తాక్​భట్​ను మట్టుబెట్టాయి. మొదట్లో హిజ్బుల్​ముజాహిదీన్ కోసం పనిచేసిన భట్.. ప్రస్తుతం ‘ది రెస్టిస్టెన్స్​ఫ్రంట్’(టీఆర్​ఎఫ్) అనే ఉగ్రవాద సంస్థలో పనిచేస్తున్నాడని, సంజయ్​శర్మ అనే పండిట్ ను చంపిన టెర్రరిస్టుల్లో భట్​ఉన్నట్లు గుర్తించామని కాశ్మీర్ అదనపు డీజీపీ తెలిపారు. కాగా బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న కాశ్మీరీ పండిట్​సంజయ్ శర్మ ఆదివారం మార్కెట్‌కు వెళుతుండగా ఉగ్రవాదులు కాల్చిచంపారు.