ఆదిభట్లలో ఫిరంగి నాలా కబ్జా

ఆదిభట్లలో  ఫిరంగి నాలా కబ్జా

ఇబ్రహీంపట్నం, వెలుగు: నిజాం కాలంలో నిర్మించిన ఫిరంగి నాలా కబ్జాకు గురవుతోంది. పాత రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందన్​వెల్లి నుంచి 85 కిలోమీటర్ల పొడవున పదుల సంఖ్యలో చెరువులను కలుపుతూ ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు వరకు దీన్ని నిర్మించారు. ప్రస్తుతం  ఆదిభట్లలో ఓ నిర్మాణ సంస్థ ఫిరంగి నాలాను కబ్జా చేసి, గోడ నిర్మిస్తోంది. గ్రామస్తుల ఫిర్యాదుతో రెవెన్యూ, ఇరిగేషన్ ఆఫీసర్లు గురువారం సంబంధిత స్థలాన్ని పరిశీలించారు. 

నాలా కబ్జా నిజమేనని తేల్చి, సదరు నిర్మాణ సంస్థ వారిని హెచ్చరించారు.ఫిరంగి నాలా, బఫర్​జోన్​లో నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవన్నారు.ఇరిగేషన్​ఏఈ సునీత, వర్క్​ఇన్​స్పెక్టర్​ శ్రీనివాస్, రెవెన్యూ ఇన్​స్పెక్టర్ మాధవి, జీపీవో జగన్ కుమార్​​  పాల్గొన్నారు.