వర్షాకాలానికి బై బై : తెలంగాణ నుంచి నైరుతి రుతు పవనాలు తిరోగమనం

వర్షాకాలానికి బై బై :  తెలంగాణ నుంచి నైరుతి రుతు పవనాలు తిరోగమనం

వర్షాకాలం అయిపోయింది.. మరికొన్ని గంటల్లో తెలంగాణ నుంచి నైరుతి రుతు పవనాలు పూర్తిగా వెళ్లిపోనున్నాయి. 2025, అక్టోబర్ 13వ తేదీ ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్ వరకు నైరుతి రుతుపవనాలు తిరోగమనం జరిగింది. ఇవాళ అంటే అక్టోబర్ 14వ తేదీ తెలంగాణలోని మరికొన్ని ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాలు ఉప సంహరణ జరగనుంది. అంటే మరికొన్ని గంటల్లో తెలంగాణలో వర్షాకాలం ముగుస్తుంది. వర్షాకాలానికి తెలంగాణ బై బై చెబుతోంది. 

తెలంగాణ నుంచి నైరుతి రుతు పవనాల ఉపసంహరణ జరుగుతుండటంతో.. అక్టోబర్ 14, 15 తేదీల్లో రాష్ట్రంలో అక్కడక్కడ.. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాటు పడనున్నాయి. ఇది కూడా మోస్తరు వర్షాలే. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గాలులు సైతం 40 కిలోమీటర్ల వేగంతో వీయనున్నాయి. 

కోస్తా ఆంధ్ర తీర ప్రాంతంలో సముద్ర మట్టానికి కిలోమీటర్ ఎత్తులో.. ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తీర ప్రాంత జిల్లాల్లో మరో మూడు, నాలుగు రోజులు ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ వారంలోనే ఏపీ నుంచి కూడా నైరుతి గుడ్ బై చెప్పనుంది.

సో.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాకాలం ముగిసినట్లే.. రాబోయే సోమవారం అమావాస్య నుంచి చలికాలం ప్రారంభం ప్రారంభం అవుతుంది. కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది.