
అమెరికా వాహన సంస్థ ఫోర్డ్ మోటార్స్ ప్రీమియం ఎస్‌యూవీ ఎండివర్ లేటెస్ట్ ఎడిషన్‌ను ఇండియా మార్కెట్లోకి శుక్రవారం విడుదల చేసింది. ఇందులో టైటానియం, టైటానియం ప్లస్ పేరుతో రెండు డీజిల్ వేరియంట్లు ఉంటాయి. వీటి ధరలు రూ.28.19 లక్షల నుం చి రూ.32.97 లక్షల వరకు ఉన్నాయి. బేసిక్ మోడల్ 14.2 కిలోమీటర్ల మైలేజీ, హైఎండ్ మోడల్ 12.62 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. ‘ఎండీవర్ 2019’లో 2.2 లీటర్ , 3.2 లీటర్ల డీజిల్ ఇంజన్లు, 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, 18 ఇంచుల అల్లా య్ వీల్స్, పవర్ అడ్జస్టబుల్ సీట్లు, ఏడు ఎయిర్ బ్యాగ్స్, హ్యాండ్స్ ఫ్రీ పవర్ లిఫ్ట్ గేట్ వంటి సదుపాయాలు ఉన్నాయి.