ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్, హైదరాబాద్ లీగల్ ఆఫీసర్, అసిస్టెంట్ లీగల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులను కాంట్రాక్ట్ బేస్డ్ విధానంలో భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ డిసెంబర్ 15.
పోస్టులు: లీగల్ ఆఫీసర్, అసిస్టెంట్ లీగల్ ఆఫీసర్.
ఎలిజిబిలిటీ
లీగల్ ఆఫీసర్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ/ఎల్ఎల్ఎంలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. జిల్లాకోర్టు/ హైకోర్టులో కనీసం 10 ఏండ్లు న్యాయవాద వృత్తిలో కొనసాగుతూ ఉండాలి. హిందూ మతానికి సంబంధించిన వారై ఉండాలి.
అసిస్టెంట్ లీగల్ ఆఫీసర్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ/ఎల్ఎల్ఎంలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. జిల్లాకోర్టు/ హైకోర్టులో కనీసం ఐదేండ్లు న్యాయవాద వృత్తిలో కొనసాగుతూ ఉండాలి. లేదా ప్రభుత్వ సంస్థల్లో కనీసం ఐదేండ్లు లీగల్ ఆఫీసర్‌గా పనిచేసిన వారై ఉండాలి. హిందూ మతానికి సంబంధించిన వారై ఉండాలి.
వయోపరిమితి: ఎలాంటి గరిష్ట వయోపరిమితి పేర్కొనలేదు.
అప్లికేషన్: ఆఫ్‌లైన్ ద్వారా.
కమిషనర్, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్, తెలంగాణ, బొగ్గులకుంట, తిలక్ రోడ్, ఆబిడ్స్, హైదరాబాద్ 500001 చిరునామాకు పంపించాలి.
అప్లికేషన్ ప్రారంభం: నవంబర్ 20.
లాస్ట్ డేట్: డిసెంబర్ 15.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్‌లిస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు endowments.ts.nic.in వెబ్సైట్లో సంప్రదించండి.
