ఎనర్జీటిక్ కాంబో రిపీట్ ఎగైన్

 ఎనర్జీటిక్ కాంబో రిపీట్ ఎగైన్

ధమాకా తో సూపర్ హిట్ కాంబో అనిపించుకున్న మాస్ మహారాజ్ రవి తేజ(Ravi Teja) ఎనర్జిటిక్ శ్రీలీల(Sreeleela) మరోసారి జత కట్టనున్నారని తెలుస్తోంది. 

రవితేజ కు డాన్ శీను,బలుపు,క్రాక్ వంటి హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చిన గోపీచంద్ మలినేని(Gopichand Malineni) దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుందని సమాచారం.ఆల్రెడీ హైట్రిక్ హిట్స్ తో  ఫామ్ లో ఉన్న ఈ కాంబో మరోసారి ఒక మాస్ మసాలా చిత్రంతో రాబోతున్నట్లు టాలీవుడ్ టాక్.
ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) నిర్మిస్తున్నారు. 

రవితేజ శ్రీలీల కాంబో రీపీట్ అయితే ఫాన్స్ కి పూనకాలే ఇక:

ధమాకా లోని పాటలతో రవితేజ ఎనర్జీ కు ఫస్ట్ క్లాస్ గ్రెస్ తో డాన్స్ కుమ్మేసిన శ్రీలీల మరోసారి ఫుల్ కిక్ ఇవ్వడానికి రెడీ అయింది.ఇప్పటికే కథ చర్చలు పూర్తయిన ఈ మూవీ సెప్టెంబర్ లో సెట్స్ పైకీ  వెళ్లనుందని సమాచారం..కాగా త్వరలో ఈ మూవీ నుండి అధికారక ప్రకటన రావాల్సి ఉంది.