హీరా గ్రూప్‌ కంపెనీల్లో ఈడీ సోదాలు.. రూ.90 లక్షల నగదు, డాక్యుమెంట్లు సీజ్

హీరా గ్రూప్‌ కంపెనీల్లో ఈడీ సోదాలు.. రూ.90 లక్షల నగదు, డాక్యుమెంట్లు సీజ్

హైదరాబాద్‌, వెలుగు: నౌ హీరా గోల్డ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ)దర్యాప్తు ముమ్మరం చేసింది. హీరా గ్రూప్స్‌ మల్టీ మార్కెటింగ్‌ కేసులతో లింక్స్‌ ఉన్న ఆస్తులను సీజ్‌ చేస్తున్నది. ఇందులో భాగంగా శనివారం సోదాలు చేసింది. బంజారాహిల్స్‌లో  హీరాగ్రూపు కార్యాలయంతోపాటు మొత్తం కుంభకోణంలో కీలక సూత్రధారి నౌహీరాషేక్‌ ఇల్లు, కార్యాలయాల్లోనూ తనిఖీలు  చేసింది.

ఈ సోదాల్లో రూ.90 లక్షల నగదుతోపాటు వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ ను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. అధిక లాభాలు ఆశచూపి సదరు సంస్థ ప్రజల నుంచి పెద్ద మొత్తంలో డిపాజిట్లు సేకరించి, వాటితో ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే మూడు విడతల్లో జరిపిన సోదాల్లో ఈడీ అధికారులు దాదాపు రూ.400 కోట్లమేర విలువైన 
ఆస్తులను జప్తు చేశారు.