అక్రమంగా గ్రానైట్ దందా..రూ.1.08 కోట్లు సీజ్ చేసిన ఈడీ

అక్రమంగా గ్రానైట్ దందా..రూ.1.08 కోట్లు సీజ్ చేసిన ఈడీ

రాష్ట్రంలోని గ్రానైట్ ఏజెన్సీలో దాడులపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది . ఈ నెల 9, 10తేదీల్లో జరిగిన సోదాల్లో  రూ. కోటి 8 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. చైనా, హాంకాంగ్, సింగపూర్ తో పాటు మరికొన్ని దేశాలకు అక్రమంగా గ్రానైట్ ఎక్స్ పోర్ట్ చేస్తున్నట్లు గుర్తించామన్నారు. ఎగుమతి పన్నులను ఎగవేస్తూ అడ్డదారిలో డబ్బు పొందినట్లు ఆధారాలు సేకరించినట్లు ఈడీ ప్రకటనలో  తెలిపింది .

శ్వేతా గ్రానైట్స్, శ్వేతా ఏజెన్సీస్, శ్రీ వేంకటేశ్వర గ్రానైట్స్..పీఎస్ఆర్ గ్రానైట్స్, అరవింద్ గ్రానైట్స్, గిరిజా షిప్పింగ్ ఏజెన్సీస్.. హవాలా కార్యకలాపాలకు పాల్పడ్డట్లు ఈడీ పేర్కొంది. ఈ గ్రానైట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల పేరుతో బినామీ అకౌంట్లు ఉన్నట్లు గుర్తించారు. గ్రానైట్ దందాలో చైనా హవాలాపై ఆరా తీస్తున్నట్లు ఈడీ తెలిపింది .