Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను ఈడీ ఏం ప్రశ్నించనుంది..? 

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను ఈడీ ఏం ప్రశ్నించనుంది..? 

ఢిల్లీ లిక్కర్ స్కామ్.. (mlc kavita) దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. తాజాగా ఇదే కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. (delhi liquor scam)గురువారం (మార్చి 9న) విచారణకు రావాలని నోటీసుల్లో EDపేర్కొంది. విచారణలో కవిత (Kavitha) ఏమేమీ ప్రశ్నించనున్నారనేదానిపై సర్వత్రా ఉత్కంఠతో పాటు ఆసక్తి కూడా నెలకొంది. ఇప్పుడు అందరి దృష్టి ఈ ఇష్యూపైనే ఉంది. 

* హైదరాబాద్ వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్లైని (arun pillai) మార్చి 7వ తేదీన అరెస్ట్ చేశారు. ఇదే కేసులో పిల్లైతో కలిపి ఎమ్మెల్సీ కవితను కూడా ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. 

* ఇప్పటికే గతంలో కవితను సీబీఐ (ED)అధికారులు విచారించారు. లిక్కర్ స్కామ్ కేసులో సమీర్ మహేంద్రుతో కలిసి, పిళ్లై కీ రోల్ పోషించినట్లు ఈడీ గుర్తించింది. 

* లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన (delhi liquor scam),శరత్ చంద్రారెడ్డి, అభిషేక్, పిళ్లైతో సంబంధాలపై ఆరా తీయనున్నారు. 

* ఈ కేసులో ఎమ్మెల్సీ కవిత మాజీ అడిటర్ బుచ్చిబాబు స్టేట్ మెంట్ తో కీలక అధారాలు బయటపడ్డాయి.

* రేపు ఢిల్లీలో విచారణకు రావాలని (mlc kavita)ఈడీ (ED) నోటీసులు జారీ చేసింది. 

* లిక్కర్ స్కామ్ లో మీ పాత్ర ఏంటని కవితను అడిగే అవకాశం ఉంది. 

* తాను కవిత ప్రతినిధి అని పిళ్లై చెప్పడంతో దీనిపై (ED)మరింత లోతుగా విచారించనున్నారు. ఇద్దరూ ఏయే బిజినెస్ లలో కలిసి ఉన్నారు. ఎప్పటి నుంచి పరిచయం ఉంది..? వంటి విషయాలు అడిగే చాన్స్ ఉంది. 

* ఇద్దరూ కలిసి పాలసీ తయారీ చేస్తున్న సమయంలో ఎలాంటి(ED) డిస్కర్షన్ లో పాల్గొన్నారనే విషయాలను రాబట్టనున్నారు. 

* పిళ్లై బిజినెస్ లో మీ పాత్ర ఏంటని కవితను అడిగే అవకాశం ఉంది. 

మరోవైపు.. మార్చి 10వ తేదీన ఢిల్లీలోని (mlc kavita)జంతర్ మంతర్ వద్ద ఎమ్మెల్సీ కవిత దీక్ష చేయాలని నిర్ణయించారు. మహిళా బిల్లు కోసం దీక్ష చేపట్టాలని ఇప్పటికే ప్లాన్ చేసుకున్నారు. చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్లు కోరుతూ ధర్నాకు పిలుపునిచ్చారు. అయితే.. ఇప్పుడు ఈ దీక్ష కూడా ఉంటుందా..? లేదా..? అనేదానిపై ఇంకా క్లారిటీ రావడం లేదు. ప్రస్తుతానికైతే కవిత ధర్నాపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఢిల్లీలో ధర్నా నేపథ్యంలో ఈడీ నోటీసులు జారీ చేయడంపై రాజకీయ దుమారం చెలరేగింది.