వాషింగ్ మెషిన్‌లో నోట్ల కట్టలు.. ఈడీ ట్వీట్

  వాషింగ్ మెషిన్‌లో నోట్ల కట్టలు.. ఈడీ ట్వీట్

మనీ లాండరింగ్‌ను ఉద్దేశిస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ట్విట్టర్‌లో వాషింగ్ మెషీన్ ఫొటోను షేర్ చేసింది. మార్చి 26వ తేదీ మంగళవారం రోజున విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈడీ క్యాప్రికార్నియన్ షిప్పింగ్ & లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ దాని డైరెక్టర్లు విజయ్ కుమార్ శుక్లా, సంజయ్ గోస్వామితో పాటు దాని అనుబంధ సంస్థలలో సోదాలు నిర్వహించినట్లు తెలిపింది. 

ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, కురుక్షేత్ర, కోల్‌కతాలోని పలు ప్రాంతాల్లో సోదాలు జరిగాయి. ఈ  సోదాల్లో వాషింగ్ మెషీన్‌లో దాచిన రూ.2.54 కోట్ల నగదును దర్యాప్తు సంస్థ స్వాధీనం చేసుకుంది.  లెక్కల్లో చూపని ఆ డబ్బును  సీజ్ చేసి, 47 బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసినట్లు పేర్కొంది.