Ashes 2025-26: స్పీడ్ గన్ వచ్చేశాడు.. పోప్‌కు వైస్ కెప్టెన్సీ.. యాషెస్‌కు ఇంగ్లాండ్ స్క్వాడ్ ప్రకటన

Ashes 2025-26: స్పీడ్ గన్ వచ్చేశాడు.. పోప్‌కు వైస్ కెప్టెన్సీ.. యాషెస్‌కు ఇంగ్లాండ్ స్క్వాడ్ ప్రకటన

నవంబర్ 21 నుంచి జరగనున్న ప్రతిష్టాత్మక యాషెస్ 2025కు ఇంగ్లాండ్ స్క్వాడ్ వచ్చేసింది. ఆస్ట్రేలియాపై ఆస్ట్రేలియాలో జరగనున్న ఈ మెగా సిరీస్ కు 16 మంది సభ్యులను ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు మంగళవారం (సెప్టెంబర్ 23) ప్రకటించింది. ఇంగ్లాండ్ జట్టుకు బెన్ స్టోక్స్ కెప్టెన్ గా కొనసాగనున్నాడు. యంగ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ కు వైస్ కెప్టెన్సీ పగ్గాలు అప్పగించారు. పోప్ స్థానంలో బ్రూక్ కు వైస్ కెప్టెన్సీ దక్కింది. స్క్వాడ్ లో గాయాల నుంచి కోలుకున్న స్టార్ ఫాస్ట్ బౌలర్లు మార్క్ వుడ్, జోఫ్రా ఆర్చర్‌లకు చోటు దక్కింది. మరో రెండు నెలలు సిరీస్ కు సమయం ఉండగానే ఇంగ్లాండ్ జట్టును స్క్వాడ్ ను ప్రకటించి ఆశ్చర్యానికి గురి చేసింది.   

"యాషెస్ టూర్ కోసం ఇంగ్లాండ్ వైస్ కెప్టెన్‌గా హ్యారీ బ్రూక్‌ను కన్ఫర్మ్ చేశారు. అలీ పోప్ స్థానంలో బ్రూక్ వైస్ కెప్టెన్ బాధ్యతలు స్వీకరిస్తాడు. డర్హామ్ ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ ఎడమ మోకాలి గాయం నుంచి కోలుకున్న తర్వాత టెస్ట్ జట్టులోకి తిరిగి వచ్చాడు. భారత్‌తో జరిగిన స్వదేశీ సిరీస్‌లో వేలికి తగిలిన గాయం నుంచి కోలుకొని సోమర్‌సెట్ స్పిన్నర్ షోయబ్ బషీర్ తిరిగి జట్టులోకి వచ్చాడు". అని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో రాసుకొచ్చింది.

►ALSO READ | Shreyas Iyer: అవకాశాలే తక్కువ.. పైగా బ్రేక్ కావాలంట: శ్రేయాస్ అయ్యర్ టెస్ట్ కెరీర్ ముగిసినట్టేనా..?

ఆగస్టులో ఇండియాతో జరిగిన ఐదో టెస్టులో గాయపడిన బెన్ స్టోక్స్‌ ఫిట్ నెస్ సాధించడం ఇంగ్లాండ్ కు అతి పెద్ద ఊరట. భుజం గాయం కారణంగా ఇండియాతో జరిగిన చివరి టెస్టులో ఆట మధ్యలోనే వైదొలిగిన క్రిస్ వోక్స్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. టీ20 స్పెషలిస్ట్ విల్ జాక్స్ తిరిగి జట్టులోకి వచ్చాడు. చివరిసారిగా ఇంగ్లాండ్ లో జరిగిన యాషెస్ 2-2 తో సమమైంది. తొలి రెండు టెస్టులు ఆస్ట్రేలియా గెలిస్తే చివరి మూడు టెస్టుల్లో ఇంగ్లాండ్ రెండు టెస్టులు గెలిచింది. ఒక మ్యాచ్ డ్రా గా ముగిసింది. అంతకముందు 2021-22 యాషెస్ లో ఆస్ట్రేలియా 4-0తో గెలిచింది. ఇటీవలే ఇండియాతో ఇంగ్లాండ్ 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను 2-2 తో సమం చేసుకుంది. మరోవైపు ఆస్ట్రేలియా వెస్టిండీస్ పై 3-0 తేడాతో గెలిచింది. 

2025-26 యాషెస్ కోసం ఇంగ్లాండ్ జట్టు:

బెన్ స్టోక్స్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్ (వైస్-కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, షోయబ్ బషీర్, జాకబ్ బెథెల్, బ్రైడాన్ కార్స్, జాక్ క్రాలే, బెన్ డకెట్, విల్ జాక్స్, ఓల్లీ పోప్, మాథ్యూ పాట్స్, జో రూట్ , జేమీ స్మిత్, జోష్ టంగ్, మార్క్ వుడ్.