బర్మింగ్‌హామ్: భారత్, ఇంగ్లండ్ మధ్య ఇవాళ సెకండ్ టీ-20 జరగనుంది. ఇప్పటికే ఫస్ట్ టీ-20లో విజయంతో అదే జోరును కొనసాగించేందుకు రెడీ అయ్యింది రోహిత్ గ్యాంగ్. బ్యాటింగ్, బౌలింగ్ లో ఇప్పటికే అదరగొడుతున్న టీమిండియాలో... సీనియర్ల రాకతో తుది జట్టులో మార్పులు జరిగే అవకాశం ఉంది. అటు ఫస్ట్ టీ-20 ఓటమి నుంచి కోలుకొని సిరీస్ కాపాడుకునేందుకు ప్లాన్ చేస్తోంది బట్లర్ గ్యాంగ్. అయితే పేలవ ఫామ్ తో సతమతం అవుతున్న టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిపైనే అందరి దృష్టి నెలకొంది. టీ-20 వరల్డ్ కప్ జట్టులో చోటు నిలబెట్టుకోవాలంటే తప్పక రాణించాల్సిన పరిస్థితిలో బరిలోకి దిగుతున్నాడు. యువ ఆటగాళ్ల దూకుడుతో... ఈ మ్యాచ్ లో మెరుగ్గా ఆడటం కోహ్లికి ఎంతో కీలకంగా మారింది.
ఫుల్ ఫామ్ లో ఉన్న ఇంగ్లండ్ తో గట్టి పోటీ తప్పదనుకున్న ఫస్ట్ టీ-20లో టీమిండియా ఈజీగా విజయం సాధించింది. సీరియన్లు విరాట్ కోహ్లి, జస్ ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా ఈ మ్యాచ్ కు అందుబాటులోకి రానున్నారు. దీపక్ హుడా, ఇషాన్ కిషన్ లాంటి కుర్రాళ్లు అదరగొడుతుండటం, సూర్యకుమార్ జట్టులో కుదురుకోవడం, హార్దిక్ పాండ్య సైతం ఫామ్ ను అందుకోవడంతో కోహ్లికి తుది జట్టులో చోటుపై ఇప్పటికే చర్చ జోరందుకుంది. ఇప్పటికే కోహ్లి ఆడే మూడో స్థానంలో దీపక్ హుడా ఆడాడు. మూడు మ్యాచ్ ల్లోనూ అతను అదరగొట్టాడు. ఫామ్ లో ఉన్న హుడాను తప్పించడం ఇబ్బందే. పంత్ కోసం దినేశ్ కార్తీక్ ను తప్పిస్తారా... లేక ఇషాన్ పై వేటు వేస్తారా అన్నది చూడాలి. ఇషాన్ పై వేటు పడితే కోహ్లి ఓపెనింగ్ లో వచ్చే అవకాశముంది. ఫస్ట్ మ్యాచ్ లో ఆడిన అర్ష్ దీప్ .. ప్లేస్ లో బుమ్రా ఆడనున్నాడు. అక్షర్ స్థానంలో జడేజాను ఆడించే చాన్స్ ఉంది.
ఫస్ట్ టీ-20 వన్ సైడ్ సాగినంత మాత్రానా.... ఇంగ్లండ్ తో అంతా ఈజీ కాదు. బట్లర్, రాయ్, మలన్, లివింగ్ స్టోన్, మొయిన్ అలీ...వీరంతా సింగిల్ హ్యాండ్ లో మ్యాచ్ ను గెలిపించే ప్లేయర్లే. ఫస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ బౌలింగ్ తేలిపోయింది. కాబట్టి ఒకట్రెండు మార్పులు చేసే అవకాశం ఉంది. టాప్లీ, మిల్స్ లపై వేటు వేసి పేసర్లు విల్లీ, గ్లీషన్ లను ఆడించే అవకాశం ఉంది.
From bowling fast ⚡️ to scoring big ? and crediting those behind the scenes. ? ?
— BCCI (@BCCI) July 8, 2022
?? ??? ???? as @hardikpandya7 chats with @ishankishan51 after #TeamIndia's win in the first #ENGvIND T20I. ? ? - By @Moulinparikh
Full interview ? ?https://t.co/1wJyFRDJqL pic.twitter.com/kIbTSD8mpB
