
ఎడ్జ్ బాస్టన్ లో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఇంగ్లాండ్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. రెండో ఇన్నింగ్స్ లో 6 వికెట్ల నష్టానికి 427 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. దీంతో ఇంగ్లాండ్ ముందు 608 పరుగుల కొండంత లక్ష్యాన్ని నిర్దేశించింది. కెప్టెన్ గిల్ (161) భారీ సెంచరీతో చెలరేగడంతో పాటు పంత్(65), జడేజా (69) హాఫ్ సెంచరీలతో రాణించారు. నేడు ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేయడానికి మరో 18 ఓవర్లు మిగిలి ఉన్నాయి. చివరి రోజు 90 ఓవర్లు ఉంటాయి. భారత్ గెలవాలంటే రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 10 వికెట్లు తీయాల్సిందే.
రెండో ఇన్నింగ్స్ లో 4 వికెట్ల నష్టానికి 304 పరుగులతో రెండో ఇన్నింగ్స్ ను ఆరంభించిన భారత్.. చివరి సెషన్ లో మరో 80 పరుగులు జోడించింది. ఆరంభం నుంచే టీమిండియా దూకుడుగా ఆడింది. ఇన్నింగ్స్ డిక్లేర్ సమయం ఆసన్నం కావడంతో గిల్, జడేజా ఇద్దరూ బ్యాట్ ఝులిపించారు. ఈ క్రమంలో జడేజా హాఫ్ సెంచరీ చేసుకోవడంతో పాటు.. గిల్ 150 పరుగుల మార్క్ చేరుకున్నాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో టంగ్,బషీర్ తలో రెండు వికెట్లు తీసుకున్నాడు. కార్స్,రూట్ తలో వికెట్ పడగొట్టారు.
వికెట్ నష్టానికి 64 పరుగులతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఇండియా కాసేపటికే కరుణ్ నాయర్ వికెట్ కోల్పోయింది. కార్స్ బౌలింగ్ లో స్లిప్ లో క్యాచ్ ఇచ్చి కరుణ్ దొరికిపోయాడు. రాహుల్ 55 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. టంగ్ వేసిన ఒక ఇన్ స్వింగ్ డెలివరీకి క్లీన్ బౌల్డయ్యాడు. గిల్ తో కలిసి పంత్ (63) కీలక ఇన్నింగ్స్ ఆడగా.. ఆ తర్వాత జడేజా (65)తో కలిసి గిల్ 167 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. తొలి ఇన్నింగ్స్ లో ఇండియా 587 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లాండ్ 407 పరుగులు చేసింది.
India declare!
— ESPNcricinfo (@ESPNcricinfo) July 5, 2025
A target surely out of reach... will England's Bazballers bat for the draw?https://t.co/t4iTZ4cwcz | #ENGvIND pic.twitter.com/HjHuQPCJ1x