
ఇంగ్లాండ్ తో ఎడ్జ్ బాస్టన్ లో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా టెస్టును శాసించే స్థాయికి వచ్చింది. కెప్టెన్ గిల్ (100) సూపర్ సెంచరీతో అదరగొట్టడంతో రెండో ఇన్నింగ్స్ లో భారత్ ఆధిక్యం 484 పరుగులకు చేరుకుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా ఓటమి ఇక దాదాపుగా అసాధ్యమే. నాలుగో రోజు టీ విరామ సమయానికి రెండో ఇన్నింగ్స్ లో 4 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. క్రీజ్ లో గిల్ (100), జడేజా (25) ఉన్నారు. రెండో సెషన్ లో 5 నుంచి 100 ఓవర్లు ఆడి భారత జట్టు ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసే అవకాశముంది.
రెండో ఇన్నింగ్స్ లో 3 వికెట్ల నష్టానికి 177 పరుగులతో రెండో సెషన్ ప్రారంభించిన టీమిండియా.. ఈ సెషన్ లో ఏకంగా 132 పరుగులు రాబట్టింది. పంత్, గిల్ సెషన్ ఆరంభం నుంచే భారీ షాట్స్ ఆడుతూ స్కోర్ బోర్డు ను ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో మొదట గిల్.. ఆ తర్వాత రాహుల్ తన హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. వేగంగా అదే క్రమంలో పంత్ బషీర్ బౌలింగ్ లో ఔటయ్యాడు. దీంతో వీరిద్దరి మధ్య 110 పరుగుల భాగస్వామ్యానికి తెర పడింది. ఈ దశలో జడేజాతో కలిసి గిల్ జట్టు ఆధిక్యాన్ని 500 పరుగులు దిశగా తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో గిల్ 129 బంతుల్లో తన టెస్ట్ కెరీర్ లో 8 వ సెంచరీ మార్క్ అందుకున్నాడు.
వికెట్ నష్టానికి 64 పరుగులతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఇండియా కాసేపటికే కరుణ్ నాయర్ వికెట్ కోల్పోయింది. కార్స్ బౌలింగ్ లో స్లిప్ లో క్యాచ్ ఇచ్చి కరుణ్ దొరికిపోయాడు. ఈ దశలో గిల్, రాహుల్ ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించారు. ఇద్దరూ జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో రాహుల్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరూ 30 పరుగుల స్వల్ప భాగస్వామ్యం తర్వాత రాహుల్ 55 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. టంగ్ వేసిన ఒక ఇన్ స్వింగ్ డెలివరీకి క్లీన్ బౌల్డయ్యాడు.
గిల్ తో జత కలిసిన పంత్ వచ్చి రావడంతోనే ఎటాకింగ్ గేమ్ ఆడాడు. ఇంగ్లాండ్ బౌలర్లపై ఎదురు దాడికి దిగుతూ బౌండరీల వర్షం కురిపించాడు. మరో ఎండ్ లో గిల్ సింగిల్స్ తీస్తూ పంత్ కు చక్కని సహకారం అందించాడు. వీరిద్దరూ ఐదో వికెట్ కు 53 బంతుల్లోనే అజేయంగా 51 పరుగులు జోడించి లంచ్ కు వెళ్లారు. ఇంగ్లాండ్ బౌలర్లలో టంగ్ రెండు.. కార్స్ ఒక వికెట్ పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్ లో ఇండియా 587 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లాండ్ 407 పరుగులు చేసింది.