
మాంచెస్టర్: మూడు మ్యాచ్‌ల సిరీస్ లో భాగంగా పాకిస్థాన్ తో జరగబోయే తొలి టెస్ట్‌కు ఇంగ్లండ్ జట్టును బుధవారం ప్రకటించారు. వెస్టిండీస్ పై విజయం సాధించిన 14 మంది సభ్యుల జట్టునే ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) కొనసాగించింది. ఈ జట్టుకు అదనంగా జేమ్స్ బ్రాసే, బెన్ ఫోక్స్, జాక్ లీచ్ , డాన్ లారెన్స్ ను రిజర్వు ప్లేయర్లుగా ఎంపిక చేసింది. మాంచెస్టర్‌లో వచ్చే బుధవారం(ఆగస్టు 5న) ఇరుజట్ల మధ్య తొలి టెస్ట్ మొదలవ్వనుంది. ఈ సిరీస్ కూడా బయో సెక్యూర్ ఎన్విరాన్ మెంట్ లో జరుగుతుందని ఈసీబీ వెల్లడించింది. సిరీస్‌లో మిగిలిన రెండు టెస్ట్‌లు సౌతాంప్టన్ లో జరుగుతాయి.
ఇంగ్లండ్ జట్టు : జో రూట్ (కెప్టెన్ ), బెన్ స్టోక్స్ , రోరీ బర్న్స్ , బట్లర్ , క్రాలే, పోప్ , సిబ్లే, అండర్సన్ , ఆర్చర్ , బెస్ , బ్రాడ్ , కరన్ , వోక్స్ , వుడ్.