ఉమెన్స్ క్రికెట్ : భారత్ పై ఇంగ్లాండ్ విజయం

ఉమెన్స్ క్రికెట్ : భారత్ పై ఇంగ్లాండ్ విజయం

గౌహతి : మహిళల టీ20 సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్ తో జరిగిన ఫస్ట్ టీ20లో  భారత్‌ ఓటమిపాలైంది.  ఇంగ్లాండ్ 41 రన్స్ తేడాతో గెలిచింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 4 వికెట్ల నష్టానికి 160 రన్స్ చేసింది.  ఇంగ్లాండ్‌ జట్టులో టాప్ ఆర్డర్‌ రాణించడంతో భారత్‌ కు 161 పరుగుల టార్గెట్ ని నిర్దేశించింది. బ్యాటర్లలో టామీ బ్యూమౌంట్‌(62), హీతర్‌ నైట్‌(40), డానిల్లీ వ్యాట్‌(35) చక్కటి ఇన్నింగ్స్‌ ఆడారు. నటాలీ స్కీవర్‌(4) విఫలం కాగా.. కేథరిన్‌ బ్రంట్‌(4*), లారెన్‌ విన్‌ఫీల్డ్(2*) నాటౌట్‌గా నిలిచారు. భారత్‌ బౌలర్లలో  రాధా యాదవ్‌ 2 వికెట్లు తీయగా.. శిఖా పాండే, దీప్తి శర్మ చెరో వికెట్‌ పడగొట్టారు.  161 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్ ప్రారంభంలోనే వికెట్లను కోల్పోయింది.

వేధకృష్ణమూర్తి(15), దీప్తి శర్మ(22), రెడ్డి(18), శిఖాపాండే(23) తప్ప మిగతా ప్లేయర్లు రాణించలేక పోయారు. 20 ఓవర్లలో 6 వికెట్లకు 119 రన్స్ చేసి ఓటమిపాలైంది మంధాన సేన. 3 టీ20 సిరీస్ లో 1-0 లీడ్ లో ఉంది ఇంగ్లాండ్. సెకండ్ టీ20 ఈ నెల 7న జరగనుంది.