Women's ODI World Cup 2025: సెమీ ఫైనల్ పోరు.. టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. సౌతాఫ్రికా బ్యాటింగ్

Women's ODI World Cup 2025: సెమీ ఫైనల్ పోరు.. టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. సౌతాఫ్రికా బ్యాటింగ్

మహిళల వరల్డ్ కప్ లో భాగంగా బుధవారం (అక్టోబర్ 29) ఇంగ్లాండ్, సౌతాఫ్రికా జట్ల మధ్య తొలి సెమీస్ ప్రారంభమైంది. గౌహతి వేదికగా  బర్సపారా క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ కీలకమైన సెమీస్ లో సౌతాఫ్రికా ఒక మార్పుతో బరిలోకి దిగుతుంది. మసాబాటా క్లాస్ స్థానంలో ప్లేయింగ్ 11 లోకి అన్నేకే బాష్ వచ్చింది. మరోవైపు ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఆదివారం (నవంబర్ 2) ఆస్ట్రేలియా లేదా ఇండియాతో ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది. 

ఇంగ్లండ్ ఇప్పటికే నాలుగుసార్లు విజేతగా నిలిచి ఐదో ట్రోఫీపై గురి పెట్టగా.. తొలిసారి సెమీస్ చేరిన సఫారీ టీమ్ ఫైనల్‌‌‌‌‌‌‌‌ చేరాలని భావిస్తోంది. స్పిన్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌ను ఎదుర్కోవడంలో తమ బలహీనతను సరిదిద్దుకొని ఇంగ్లిష్ టీమ్ పని పట్టాలని ఆశిస్తోంది. నాకౌట్ దశకు చేరుకునే క్రమంలో సౌతాఫ్రికా రెండు భారీ ఓటములను చవిచూసింది. ఈ రెండు సందర్భాల్లోనూ స్పిన్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌ను ఎదుర్కోవడంలో ఆ టీమ్ బ్యాటింగ్ తడబడింది. తమ తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో 69 రన్స్‌‌‌‌‌‌‌‌కే ఆలౌటైన సఫారీలు.. ఆ తర్వాత న్యూజిలాండ్, ఇండియాపై గెలిచినా, లీగ్ దశలో ఆస్ట్రేలియాపై 97 రన్స్‌‌‌‌‌‌‌‌ కే  కుప్పకూలడం ఆ టీమ్‌‌‌‌‌‌‌‌ స్పిన్ వీక్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌ను మరోసారి స్పష్టం చేసింది.  

►ALSO READ | Rohit Sharma: 38 ఏళ్ళ వయసులో సరికొత్త చరిత్ర.. తొలిసారి వన్డే ర్యాంకింగ్స్‌లో రోహిత్ శర్మకు అగ్ర స్థానం

ఈ బలహీనతను మరోసారి సొమ్ము చేసుకోవాలని ఇంగ్లండ్ పట్టుదలతో ఉంది. ఆ జట్టు స్పిన్ త్రయం  సోఫీ ఎకిల్‌‌‌‌‌‌‌‌స్టోన్, లిన్సీ స్మిత్, చార్లీ డీన్ సఫారీ బ్యాటర్లను కట్టడి చేయాలని చూస్తున్నారు. అయితే, తమ చివరి మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఫీల్డింగ్ చేస్తూ భుజానికి గాయమైన ఎకిల్‌‌‌‌‌‌‌‌స్టోన్ ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌కు అందుబాటులో ఉండటంపై ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు, సౌతాఫ్రికా తరఫున కెప్టెన్ లారా వోల్‌‌‌‌‌‌‌‌వార్ట్‌‌‌‌‌‌‌‌  ఏడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో 50.16 సగటుతో 301  రన్స్‌‌‌‌‌‌‌‌ చేసి టీమ్‌‌‌‌‌‌‌‌ను ముందుండి నడిపించింది. అయితే, ఆమె  మినహా తజ్మిన్ బ్రిట్స్, సునే లూస్, మరిజేన్ కాప్ వంటి కీలక బ్యాటర్లు నిలకడగా రాణించకపోవడం జట్టును ఆందోళనకు గురిచేస్తోంది.  
 

దక్షిణాఫ్రికా మహిళలు (ప్లేయింగ్ XI): 

లారా వోల్వార్డ్ట్ (కెప్టెన్), తజ్మిన్ బ్రిట్స్, సునే లూస్, అన్నేరీ డెర్క్‌సెన్, అన్నెకే బాష్, మారిజానే కాప్, సినాలో జాఫ్తా (వికెట్ కీపర్), క్లో ట్రయాన్, నాడిన్ డి క్లెర్క్, అయాబొంగా ఖాకా, నాన్‌కులులేకో మ్లాబా

ఇంగ్లాండ్ మహిళలు (ప్లేయింగ్ XI): 

అమీ జోన్స్(వికెట్ కీపర్), టామీ బ్యూమాంట్, హీథర్ నైట్, డేనియల్ వ్యాట్-హాడ్జ్, నాట్ స్కైవర్-బ్రంట్ (కెప్టెన్), సోఫియా డంక్లీ, ఆలిస్ కాప్సే, షార్లెట్ డీన్, సోఫీ ఎక్లెస్టోన్, లిన్సే స్మిత్, లారెన్ బెల్