Rohit Sharma: 38 ఏళ్ళ వయసులో సరికొత్త చరిత్ర.. తొలిసారి వన్డే ర్యాంకింగ్స్‌లో రోహిత్ శర్మకు అగ్ర స్థానం

Rohit Sharma: 38 ఏళ్ళ వయసులో సరికొత్త చరిత్ర.. తొలిసారి వన్డే ర్యాంకింగ్స్‌లో రోహిత్ శర్మకు అగ్ర స్థానం

టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో సత్తా చాటాడు. ఆస్ట్రేలియా పై ఇటీవలే వన్డే సిరీస్ లో సత్తా చాటిన రోహిత్ టాప్ కు దూసుకెళ్లాడు. 38 ఏళ్ళ వయసులో వన్డేల్లో నెంబర్ ర్యాంక్ కు చేరుకొని చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కు ముందు 745 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానంలో ఉన్న హిట్ మ్యాన్.. రెండు స్థానాలు ఎగబాకి నెంబర్ స్థానానికి చేరుకోవడం విశేషం. అంతేకాదు వన్డేల్లో అతి పెద్ద వయసులో నెంబర్ ర్యాంక్ అందుకున్న ప్లేయర్ గా రికార్డులకెక్కాడు. సహచర ప్లేయర్ శుభమాన్ గిల్ టాప్ ర్యాంక్ నుంచి మూడో స్థానానికి పడిపోయాడు. ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ ఇబ్రహీం జద్రాన్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. 

ఆస్ట్రేలియాతో ఇటీవలే ముగిసిన మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అదరగొట్టాడు. తొలి వన్డేలో విఫలమైనా రెండో వన్డేలో హాఫ్ సెంచరీ ( 97 బంతుల్లో 73) చేసి రాణించాడు. సిడ్నీలో జరిగిన మూడో వన్డేలో చెలరేగుతూ సెంచరీ (125 బంతుల్లో 121) పరుగులు మార్క్ అందుకున్నాడు. ఓవరాల్ గా ఈ సిరీస్ లో అత్యధిక పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ, శుభమాన్ గిల్ తర్వాత  వరల్డ్ నెంబర్ బ్యాటర్ గా నిలిచిన ఐదో ప్లేయర్ గా రోహిత్ ఈ ఘనత అందుకున్నాడు. 

►ALSO READ | IND vs AUS T20: తొలి టీ20లో టాస్ ఓడిన భారత్.. జట్టులోకి డేంజరస్ బౌలర్ రీ ఎంట్రీ

ఇతర భారత క్రికెటర్ల విషయానికి వస్తే నయా వన్డే కెప్టెన్ శుభమాన్ గిల్ నెంబర్ వన్ ర్యాంక్ నుండి మూడో స్థానానికి పడిపోయాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్ లో గిల్ ఘోరంగా విఫలమయ్యాడు. మూడు వన్డేల్లో కేవలం 43 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో రోహిత్ కు అగ్ర స్థానాన్ని కోల్పోయాడు. మరోవైపు కోహ్లీ తొలి రెండు వన్డేల్లో డకౌటై తీవ్రంగా నిరాశపరిచాడు. అయితే మూడో వన్డేలో హాఫ్ సెంచరీ (74) చేసి టచ్ లోకి వచ్చాడు.  తొలి రెండు వన్డేల్లో డకౌట్ కావడం వలన కోహ్లీ ఒక స్థానం దిగజారి ఆరో స్థానానికి పడిపోయాడు. శ్రేయాస్ అయ్యర్ ఒక స్థానం మెరుగుపర్చుకొని తొమ్మిదో స్థానంలో నిలిచాడు.