IND vs AUS T20: తొలి టీ20లో టాస్ ఓడిన భారత్.. జట్టులోకి డేంజరస్ బౌలర్ రీ ఎంట్రీ

IND vs AUS T20: తొలి టీ20లో టాస్ ఓడిన భారత్.. జట్టులోకి డేంజరస్ బౌలర్ రీ ఎంట్రీ

ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు మ్యాచుల టీ20 సిరీస్‎లో భాగంగా బుధవారం (అక్టోబర్ 29) తొలి టీ20 మ్యాచ్ ప్రారంభమైంది. కాన్ బెర్రాలోని మనూక ఓవల్‎ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‎లో అతిథ్య ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా మొదట బ్యాటింగ్ చేయనుంది. ఆసియా కప్ టైటిల్ గెలిచిన తర్వాత టీమిండియా ఆడుతోన్న తొలి టీ20 సిరీస్ ఇదే. 

ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్ ఓడిపోయినా భారత్ ఎలాగైనా టీ20 సిరీస్ గెలిచి సొంత దేశంలోనే కంగారులకు షాక్ ఇవ్వాలని సూర్య సేన పట్టుదలతో ఉంది. మరోవైపు వన్డే సిరీస్ గెలుచుకొని ఫుల్ జోష్‎లో ఉన్న ఆస్ట్రేలియా అదే ఊపులో టీ20 సిరీస్ కూడా గెలవాలనే ఉవ్విళ్లూరుతోంది. ప్లేయింగ్ 11 విషయానికి వస్తే వన్డే సిరీస్‎లో రెస్ట్ తీసుకున్న బుమ్రా తుది జట్టులోకి వచ్చాడు. 

జట్లు:

ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): మిచెల్ మార్ష్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (కెప్టెన్), టిమ్ డేవిడ్, మిచెల్ ఓవెన్, మార్కస్ స్టోయినిస్, జోష్ ఫిలిప్, జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, జోష్ హాజిల్‌వుడ్

భారతదేశం (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, శుభ్‌మాన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజు సామ్సన్ (వికెట్ కీపర్), శివం దుబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా