ఫస్ట్ మేం స్లెడ్జింగ్ చేయం.. మమ్మల్ని గెలికితే మాత్రం వదలం: టీమిండియాకు స్టోక్స్ వార్నింగ్

ఫస్ట్ మేం స్లెడ్జింగ్ చేయం.. మమ్మల్ని గెలికితే మాత్రం వదలం: టీమిండియాకు స్టోక్స్ వార్నింగ్

బ్రిటన్: ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతోన్న ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్ రసవత్తరంగా సాగుతోంది. ఆటకు ఆట.. మాటకు మాట అన్నట్లుగా ఇరుజట్లు దూకుడు ప్రదర్శిస్తున్నాయి. ఫస్ట్ టెస్టులో అతిథ్య ఇంగ్లాండ్ గెలవగా.. రెండో టెస్టులో విజయం సాధించి టీమిండియా రివేంజ్ తీర్చుకుంది. మూడో టెస్టులో విజయం సాధించి మళ్లీ భారత్‎ను దెబ్బకొట్టింది ఇంగ్లాండ్. ఆటలోనే కాకుండా స్లెడ్జింగ్ విషయంలో కూడా ఏ జట్టు తగ్గడం లేదు. ఉడుకు రక్తంతో నిండిన భారత్ యువ జట్టు ఇంగ్లాండ్ ప్లేయర్లను మాటలతో బాగానే రెచ్చగొడుతున్నారు.

ఇంగ్లాండ్ ఆటగాళ్లు కూడా ధీటుగా బదులిస్తున్నారు. ముఖ్యంగా లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ మాత్రం క్రికెట్ ఫ్యాన్స్‎కు మస్తూ మజా అందించింది. ఈ క్రమంలో తమను స్లెడ్జింగ్ చేయొద్దని టీమిండియాను హెచ్చరించాడు ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్. బుధవారం (జూలై 23) నుంచి మాంచెస్టర్ వేదికగా నాలుగో టెస్ట్ మొదలు కానుంది. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన ప్రీ ప్రెస్ కాన్ఫరెన్స్‎లో స్టోక్స్ హాట్ కామెంట్స్ చేశాడు. ఇంగ్లాండ్ ఉద్దేశపూర్వకంగా స్లెడ్జింగ్ మొదలు పెట్టదని.. కానీ మమ్మల్ని గెలికితే మాత్రం వెనక్కి తగ్గమని స్పష్టం చేశాడు. 

Also Read : డూ ఆర్ డై మ్యాచ్‎కు ముందు టీమిండియాకు బిగ్ షాక్

అందుకే అనవసరంగా ఇంగ్లాండ్‎ను స్లెడ్జింగ్ చేయొద్దని టీమిండియాకు వార్నింగ్ ఇచ్చాడు. ఇలాంటి పెద్ద సిరీసుల్లో ఇరుజట్ల మధ్య కొన్ని ఉద్రిక్త ఘటనలు చోటు చేసుకోవడం కామన్ అన్నాడు స్టోక్స్. ఏ జట్టు కూడా కావాలని స్లెడ్జింగ్ చేయాలని కోరుకోదని నేను అనుకుంటున్నానని.. అలా చేయడం ద్వారా ఆటపై ఏకాగ్రత కోల్పోతామన్నాడు ఇంగ్లాండ్ కెప్టెన్. కాకపోతే మ్యాచులో ఏదో ఒక సందర్భంలో ఇరుజట్ల మధ్య వాడీ వాడీ క్షణాలు చోటు చేసుకుంటాయన్నాడు. ఇక ఈ సిరీస్ లో భాగంగా ఇప్పటి వరకు జరిగిన మూడు టెస్టుల్లో క్రికెట్ నాణ్యత అద్భుతంగా ఉందన్నాడు స్టోక్స్. 

కాగా, ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్‎లో భారత్ 1-2 తేడాతో వెనుకబడి ఉంది. తొలి టెస్టులో అతిథ్య ఇంగ్లాండ్ గెలవగా.. రెండో టెస్టులో టీమిండియా విజయం సాధించి తొలి ఓటమికి రివేంజ్ తీర్చుకుంది. లార్డ్స్‎లో జరిగిన మూడో టెస్టులో విజయంతో కంబ్యాక్ ఇచ్చిన ఇంగ్లాండ్ 1-2 తేడాతో సిరీస్‎లో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 2025, జూలై 23న మాంచెస్టర్‌లోని ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో నాల్గో టెస్ట్ జరగనుంది. ఈ మ్యాచులో ఎలాగైనా గెలిచి సిరీస్ సమం చేయాలని భారత్.. మాంచెస్టర్‌‎లో విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవాలని ఇంగ్లాండ్ ఉవ్విళ్లురుతున్నాయి.