ఇంగ్లండ్ × పాకిస్థాన్ తొలి టెస్ట్ మ.3:30 నుంచి

ఇంగ్లండ్ × పాకిస్థాన్ తొలి టెస్ట్ మ.3:30 నుంచి

మాంచెస్టర్: వెస్టిండీస్ పై రెండు వరుస విజయాల తర్వాత ఇంగ్లండ్ జట్టు.. మరో కీలకమైన టెస్ట్ సిరీస్ కు సిద్ధమైంది. మూడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా బుధవారం నుంచి జరిగే తొలి టెస్ట్ లో పాకిస్థాన్ తో అమీతుమీ తేల్చుకోనుంది. కరోనాతో ప్రపంచం మొత్తం అల్లా డిపోతున్న టైమ్ లో ఇంటర్నేషనల్ క్రికెట్ ను అద్భుతంగా రీస్టార్ట్ చేసిన ఇంగ్లండ్ .. ఐసీసీ టెస్ట్ చాంపియన్ షిప్ పాయింట్స్ టేబుల్ లో ప్లేస్ ను మెరుగుపర్చుకోవడంపై దృష్టిపెట్టింది. విండీస్ పై సిరీస్ గెలిచిన రూట్ సేన 80 పాయింట్లు సాధించింది. అయితే ఇప్పుడు పాక్ తో జరగబోయే సిరీస్ లో మరో రెండు విజయాలు సాధిస్తే . . రెండో ప్లేస్ లో ఉన్న ఆస్ట్రేలియాను వెనక్కి నెడుతుంది. విండీస్ తో ఆడిన టీమ్‌‌‌‌‌‌‌‌నే తొలి టెస్ట్ కు కొనసాగించిన ఇంగ్లండ్ మేనేజ్ మెంట్ విజయంపై భారీ ఆశలు పెట్టుకుంది. దీంతో బర్న్స్ , క్రాలీ, సి బ్లే, రూట్ , స్టోక్స్ మరోసారి బ్యాటింగ్ భారాన్ని మోయాల్సిందే. బౌలింగ్ లోనూ హోమ్ టీమ్ కు ఎదురులేదు. బ్రాడ్ తన ఫామ్ ను కొనసాగిస్తే పాక్ కు కష్టాలు తప్పవు. అండర్సన్ , ఆర్చర్, వోక్స్ కొద్దిగా సాయం అందించినా.. ఇంగ్లండ్ కు తిరుగుండదు. అయితే స్టోక్స్ బౌలింగ్ చేస్తే ఎక్స్ ట్రా బ్యాట్స్ మన్ గా క్రాలీ టీమ్ లోకి వస్తాడు. అప్పుడు సీమర్లను రొటేషన్ పద్ధతిలో ఉపయోగించుకుంటారు.

మరోవైపు టెస్ట్ చాంపియన్ షిప్ లో ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయని పాక్ బ్యాటింగ్ లైనప్ అనిశ్చితికి మారుపేరు. అయితే ఇంగ్లండ్ కండీషన్స్ లో కొంత మంది ప్లేయర్లు నిలకడగా ఆడటం కలిసొచ్చే అంశం. రెండు వామప్ మ్యాచ్ ల్లో పాక్ ప్లేయర్లు ఫర్వాలేదని అనిపించారు. సో హైల్ ఖాన్ రెండు మ్యాచ్ ల్లోనూ ఐదేసి వికెట్లు తీశాడు. మాంచెస్టర్ లో టర్నింగ్ ట్రాక్ ఉంటుందన్న నేపథ్యంలో ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగాలని పాక్ భావిస్తోంది.

Pakistani batsman Umar Akmal kisses his helmet as he celebrates after scoring a century (100 runs) during the third match of the Asia Cup one-day cricket tournament between Pakistan and Afghanistan at the Khan Shaheb Osman Ali Stadium in Fatullah, on the outskirts of Dhaka on February 27, 2014. AFP PHOTO/Dibyangshu SARKAR (Photo credit should read DIBYANGSHU SARKAR/AFP/Getty Images)