వచ్చే ఏడాది నుంచి ఇంగ్లీష్ మీడియం బోధన..!

వచ్చే ఏడాది నుంచి ఇంగ్లీష్ మీడియం బోధన..!

హైదరాబాద్ : రాష్ట్రంలో వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధన ప్రారంభించే అవకాశముందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. పాఠశాలల్లో ఇకపై ఇంగ్లీష్, తెలుగు మీడియంలు ఉంటాయని అన్నారు. త్వరలోనే కేబినెట్ సబ్ కమిటీ సమావేశమై ఈ అంశంపై చర్చిస్తుందని చెప్పారు. సర్కారీ బడుల్లో బోధిస్తున్న సగం మంది టీచర్లకు ఇంగ్లీష్లో బోధించే పరిజ్ఞానం ఉందని, మిగతా వారికి ఆంగ్లంపై పట్టు కోసం శిక్షణ తరగతులు నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు మంత్రి సబిత ప్రకటించారు. భవిష్యత్తులో ఇంగ్లీష్ మీడియంను దృష్టిలో పెట్టుకునే టీచర్స్ రిక్రూట్మెంట్ నిర్వహించే అవకాశముందని అన్నారు. 

For more news..

కరోనా ట్రీట్మెంట్లో స్టెరాయిడ్స్పై కేంద్రం సీరియస్ గైడ్లైన్స్

గద్వాల బాల గాయకుడి పాట వెనుక ఎన్ని బాధలో..!