హైదరాబాద్ శివారు దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ జరుగుతోంది. ఎయిర్ ఫోర్స్ లో ప్రీ కమిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న ఫ్లైట్ క్యాడెట్లు పరేడ్ లో పాల్గొన్నారు. వైమానిక దళ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి పరేడ్ కు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. క్యాడెట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. క్యాడెట్ల ప్రదర్శనను ప్రత్యక్షంగా తిలకించారు వీఆర్ చౌదరి. గాలిలో చేతక్ హెలికాప్టర్లతో క్యాడెట్లు చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
శిక్షణ పూర్తి చేసుకున్న ఫ్లైట్ ఫ్లైట్ క్యాడెట్‌లకు అభినందనలు తెలిపారు ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి. భారత వైమానిక దళంలోని పలు శాఖలో అంకిత భావంతో పనిచేయాలి. నేవి, వాయూ, మిలటరీ ఏ విభాగంలో అయిన క్రమ శిక్షణతో రాణించాలి. లీడర్ క్వాలిటస్ గుడ్ క్యారెక్టర్ తో దేశ ఔన్నత్యాన్ని కాపాడాలి. ఫ్లైట్ క్యాడెట్‌లుగా మిమ్మల్ని ఈ స్థాయిలో నిలబెట్టిన మీ తల్లిదండ్రులకు అభినందనలు.
ఎయిర్ ఫోర్స్ అకాడమీ మీకు శిక్షణ ఇవ్వడానికి ప్రత్యేకమైన వాతావరణాన్ని అందించింది. మీ విధులను సమర్థవంతంగా నిర్వర్తించడానికి ఈ ఇన్‌స్టిట్యూట్ మీకు వృత్తిపరమైన నైపుణ్యాల లక్షణాలను అందించింది. ఆధునిక యుద్ధంలో అధునాతన టెక్నాలజీ అందిపుచ్చుకోవాలి. యువ నాయకులుగా యుద్ధాలను గెలవడానికి సాంకేతికతను సమర్థవంతంగా స్వీకరించాలి, ఆవిష్కరించాలి ప్రభావితం చేయాలి. విశిష్ట స్థాయిలో దేశానికి సేవలు అందియ్యాలి . దేశం మీ వైపు చూస్తుంది అని అన్నారు.
