ఒక కొత్త కాన్సెప్ట్‌తో రాజ్ బోను దర్శకత్వంలో రాము ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎం రాము నిర్మిస్తున్న చిత్రం ‘ఏంటో అంతా సరికొత్తగా’. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను లాంచ్ చేసిన దర్శకుడు శైలేష్ కొలను మాట్లాడుతూ ‘పోస్టర్ చూడగానే ఫ్రెష్ ఫీలింగ్ వచ్చింది. టైటిల్ కూడా కొత్తగా, ఆకర్షణీయంగా ఉంది. ప్రస్తుతం ప్రేక్షకులు కొత్త కంటెంట్, కొత్త కథలను ఎక్కువగా ఆదరిస్తున్నారు.
ఈ సినిమా కూడా అదే దిశలో మంచి ప్రయత్నంగా కనిపిస్తోంది. టీమ్ అంతా కొత్త ఎనర్జీతో పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. అందరికీ ఆల్ ద బెస్ట్’ అని చెప్పాడు.
షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉందని, త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని దర్శక నిర్మాతలు చెప్పారు. ఎం.రిషి సంగీతం అందిస్తున్నాడు.
