రాడార్​ స్టేషన్​పై మరోసారి ఆలోచించాలి .. దామగుండం భూముల్లో పెట్టొద్దు

రాడార్​ స్టేషన్​పై మరోసారి ఆలోచించాలి ..  దామగుండం భూముల్లో  పెట్టొద్దు

హైదరాబాద్, వెలుగు : వికారాబాద్ జిల్లా దామగుండంలో నేవీ వీఎల్ఎఫ్ రాడార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాటులో గత ప్రభుత్వం చేసిన తప్పులనే ప్రస్తుత ప్రభుత్వం చేస్తుందని, మరోసారి పరిశీలించాలని పర్యావరణ వేత్తలు, నిపుణులు కోరారు. రాడార్ పై పర్యావరణవేత్తలు ఎక్కడ పోయారని మాజీ మంత్రి కేటీఆర్ అనడం హాస్యాస్పదమని, ఆయనకు మేం ఇప్పుడు గుర్తొచ్చామా? ఇన్నాళ్లు మేం కనిపించలేదా..? మీ ప్రభుత్వమే దీనికి సహకరించి ఇప్పుడిలా మాట్లాడటమేంటి ? అని వారు ప్రశ్నించారు. ఇకనైనా కేటీఆర్ క్షమాపణ చెప్పి రాడార్ సెంటర్ ఏర్పాటుపై పోరాడాలని హితవు పలికారు.

రాడార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ఏర్పాటు అంశంపై శుక్రవారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. రాడార్ సెంటర్ ను ఇక్కడే ఎందుకు ఏర్పాటు చేస్తున్నారో అర్థం కావడం లేదని, దీనికోసం దేశంలోని 14 ప్రాంతాల్లో ప్రపోజల్స్ ఉన్నాయన్నారు.  కర్నాటకలో మైనింగ్ భూములను ఇచ్చేందుకు అక్కడి ప్రభుత్వం ముందుకొచ్చిందని, అదికాకుండా తెలంగాణలో  ఏర్పాటు చేయడమేంటని పర్యావరణవేత్త బీవీ సుబ్బారావు ప్రశ్నించారు. వీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాడార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంటర్​ను పచ్చని అడవుల్లో పెట్టడం మంచిది కాదని, గత బీఆర్ఎస్ ​ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.

ఇప్పుడు  కొత్తగా ఏర్పడిన ప్రభుత్వమైనా తమ గోడుని వినాలని పర్యావరణవేత్త, ప్రొఫెసర్  పురుషోత్తంరెడ్డి కోరారు. రాడార్​కు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేశామన్నారు. ఇంకా చేస్తున్నామని, ప్రజల్లో కూడా అవగాహన కల్పించామని, కోర్టులను సైతం ఆశ్రయించామని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ సర్కార్ పాలనలోనే ప్రకృతి విధ్వంసం జరిగిందని, ఇసుక, చెరువులను మాయం చేశారని ఆరోపించారు.

ఇప్పటికైనా ఇది ఆగకపోతే భవిష్యత్ చాలా కష్టమవుతుందని పేర్కొన్నారు.  రాడార్ సెంటర్​కు వ్యతిరేకం కాదని, రాష్ట్రంలో ఏర్పాటు చేయడం వల్ల అడవులు అన్యాక్రాంతమవుతాయని పర్యావరణ వేత్త దొంతి నర్సింహారెడ్డి తెలిపారు.