
ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఉద్యోగుల పీఎఫ్ వడ్డీ రేట్లను ప్రకటించింది.2025 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లకు 8.25 శాతం వడ్డీ రేటుగా నిర్ణయించినట్లు EPFO బోర్డు శుక్రవారం తెలిపింది. గతేడాది వడ్డీరేట్లనే కొనసాగిస్తోంది. అంతకుముందు 2024 ఆర్దిక సంవత్సరానికి EPF పై వడ్డీ రేటును 8.25 శాతంగా ఉంది.
FY23లో వడ్డీ రేటు 8.15శాతం, FY 22లో 8.10శాతంగా ఉంది. ఇది మునుపటి ఆర్థిక సంవత్సరం కంటే తగ్గుదలను సూచిస్తుంది. ఇటీవలి చరిత్రలో అత్యల్ప వడ్డీ రేటు 2021-22లో 8.10శాతం, ఇది 19-78 నుంచి ఇదే అత్యల్ప రేటు. 1978లో వడ్డీరేటు 8శాతంగా ఉంది.
Also Read:-రెండేళ్లలోనే మళ్లీ కుంభమేళా.. ఈ సారి ఎక్కడ.. ఎన్ని రోజులు.. ఏ తేదీల్లో..?
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) నిర్ణయం తర్వాత 20-25 ఆర్థిక సంవత్సరంలో EPF డిపాజిట్లపై వడ్డీ రేటు ఆమోదం కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత 2024-25 సంవత్సరానికి EPF వడ్డీ రేటు సంబంధించిన మొత్తం చందాదారుల ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఏడు కోట్లకు పైగా ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదించిన తర్వాతే EPFO వడ్డీ రేటును ప్రకటిస్తుంది.