ఈ ఒక్క యాప్ చాలు: మీ పిఎఫ్ డబ్బులు, పాస్‌బుక్, విత్‌డ్రా, సేవింగ్స్ అన్ని తెలుసుకోవచ్చు...

ఈ ఒక్క యాప్ చాలు:  మీ పిఎఫ్ డబ్బులు, పాస్‌బుక్, విత్‌డ్రా, సేవింగ్స్ అన్ని తెలుసుకోవచ్చు...

ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ​​కస్టమర్ల కోసం ఉమాంగ్ యాప్ ద్వారా ఎన్నో గొప్ప  సేవలను అందిస్తుంది, దీని వల్ల పేపర్ వర్క్  పని ఉండదు.  అంతేకాదు  మీరు ఎక్కడ ఉన్న  మీ ప్రావిడెంట్ ఫండ్(PF) అకౌంట్ వివరాలు, పాస్‌బుక్‌, క్లెయిమ్‌ సబ్మిట్ వరకు అన్ని తెలుసుకోవచ్చు.  అలాగే రిటైర్మెంట్ సేవింగ్స్  గురించి ఎప్పటికప్పుడు సమాచారం క్షణాల్లో చూపిస్తుంది. అంటే ఈ యాప్ అన్ని సేవలను ఒకే చోట మీకు  అందిస్తుంది. ఈ యాప్ కొన్ని ముఖ్యమైన ఫీచర్స్ చుస్తే  క్లెయిమ్ సబ్మిషన్, UAN కార్డ్ డౌన్‌లోడ్‌, కొత్త కస్టమర్ల కోసం ఫేస్ లాగిన్ కూడా ఉన్నాయి.

 డిజిటల్‌గా EPFO క్లెయిమ్‌: ఉమాంగ్ యాప్‌లో ఉన్న అత్యంత ఉపయోగపడే సేవలలో ఒకటి EPF క్లెయిమ్‌ చేయడం. కస్టమర్లు UAN (యూనివర్సల్ అకౌంట్ నంబర్)ని  వారి మొబైల్ నంబర్‌తో పాటు MPINని ఎంటర్ చేసి క్లెయిమ్ రిక్వెస్ట్  చేయొచ్చు. అయితే, కొత్త కస్టమర్లు దీని కోసం ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లెయిమ్ సబ్మిట్ చేసిన తర్వాత యాప్ ద్వారా స్టేటస్ ట్రాక్ చేయవచ్చు. 

ALSO READ : అనంత్ అంబానీ వంతారాపై..

UAN కార్డు, PF లావాదేవీలు : ఈ యాప్ ద్వారా ముఖ్యమైన సమాచారం తెలుసుకోవచ్చు.  మీ పుట్టిన తేదీతో  మీరు మీ UAN కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, ఇది EPFO ​​కస్టమర్లకు చాల ముఖ్యమైనది. అలాగే పాస్‌బుక్ ఫీచర్ ద్వారా మీ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్  ట్రాన్సక్షన్స్ వివరాలు చూడొచ్చు. గత మూడు నెలల డేటా యాప్‌లో ఉంటుంది ఇంకా కావాలనుకుంటే పాత రికార్డ్స్  PDF ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఫేస్ అతేంటికేషన్ : ఈ నెల నుండి ఉమాంగ్ UAN నెంబర్, వెరిఫికేషన్  సహా చాల సేవల కోసం ఆధార్ ఆధారిత ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీ (FAT)ని ప్రారంభించింది. ఈ బయోమెట్రిక్ అప్‌గ్రేడ్ ఫిజికల్ వెరిఫికేషన్ అవసరాన్ని తొలగిస్తూ సురక్షితమైన సేవలను ఇస్తుంది.
UAN కోసం : ఇప్పుడు కస్టమర్లు మొదటిసారి ముఖ గుర్తింపు(face recognition) ఉపయోగించి UANను రూపొందించుకోవచ్చు, ప్రాసెస్ చేసుకోవచ్చు. 
UAN యాక్టివేషన్: ముఖ గుర్తింపుతో జారీ చేసిన UAN యాక్టివేషన్  కూడా వేగంగా, సురక్షితంగా ఉంటుంది.