అనంత్ అంబానీ వంతారాపై.. సిట్ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశం

అనంత్ అంబానీ వంతారాపై.. సిట్ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ: రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ప్రారంభించిన వంతారా వన్యప్రాణులు రక్షణ, పునరావాస కేంద్రం వ్యవహారాలపై విచారణకు సుప్రీంకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసింది. వంతారాపై మనీలాండరింగ్ ఆరోపణలు రావడంతో కోర్టు SIT ​​ఏర్పాటు చేసింది. ఈ ఆరోపణల వాస్తవాలను SIT తేలుస్తుందని స్పష్టం చేసింది. 

సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ జే.చెలమేశ్వర్ నేతృత్వంలోని సిట్ ను ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు. వంతారా జూకు తరలించిన జంతువులను ఎలా తెచ్చారు..ఈ ప్రక్రియలో చట్టబద్దత ఉందా, వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారమే ఈ జంతువుల తరలింపు జరిగిందా.. వంటి అంశాలను సిట్ పరిశీలించి సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించనుంది. 

వంటారా వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాన్ని గుజరాత్ లోని జామ్ నగర్ ప్రాంతంలో రియలన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు  చేశారు. అరుదైన వన్యప్రాణుల సంరక్షణ లక్ష్యంగా రిలయన్స్ వంతారాను ఏర్పాటు చేసింది. అయితే జంతువుల సేకరణ, చట్టబద్ధతపై అనుమానాలు వ్యక్తమవుతున్న క్రమంలో సుప్రీంకోర్టు సిట్ దర్యాప్తు ఆదేశాలు జారీ చేసింది. 

సిట్ లో సభ్యులుగా ఉత్తరాఖండ్, తెలంగాణ హైకోర్టుల మాజీ చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర చౌహాన్, ముంబై మాజీ పోలీస్ కమిషనర్ హేమంత్ నగ్రాలే , కస్టమ్స్ అడిషనల్ కమిషనర్ అనిష్ గుప్తా ఉన్నారు. 

►ALSO READ | Kiren Rijiju: కిరణ్ రిజిజు కాన్వాయ్ ముందు.. నదిలో పడిపోయిన వాహనం

వంటారాపై హైలైట్ చేసిన ఆందోళనలను అధ్యయనం చేసిన తర్వాత సెప్టెంబర్ 12 లోగా విచారణ నిర్వహించి నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించాలని ప్యానెల్‌కు ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. 

నిజనిర్ధారణ కోసం SIT ఏర్పాటు చేసినట్లు కోర్టు తెలిపింది. ఇది కోర్టు నిజమైన వాస్తవ స్థితిని నిర్ధారించడంలో సహాయపడుతుంది..తద్వారా కోర్టు తదుపరి ఆదేశాలు జారీ చేసేందుకు వీలు కల్పిస్తుందని సుప్రీంకోర్టు వెల్లడించింది.