Kiren Rijiju: కిరణ్ రిజిజు కాన్వాయ్ ముందు.. నదిలో పడిపోయిన వాహనం

Kiren Rijiju: కిరణ్ రిజిజు కాన్వాయ్ ముందు.. నదిలో పడిపోయిన వాహనం

లద్దాఖ్..కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు తృటిలో ప్రమాదం తప్పింది. మంగళవారం(ఆగస్టు26) లడ్డాఖ్‌లో కాన్వాయ్‌కి ముందు వాహనం నదిలో పడిపోయింది. ఈ వీడియోను షేర్ చేస్తూ.. ప్రమాదం జరిగినప్పుడు ఆ కాన్వాయ్ సమయానికి వెళ్లిందని..అక్కడ చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులను సురక్షితంగా రక్షించారని రిజిజు Xలో రాశారు. 

లడఖ్‌లోని నదిలో పడిపోయిన ట్రక్కు పైన ఇద్దరు వ్యక్తులు చిక్కుకుపోయినట్లు వీడియోలో కనిపిస్తోంది. వారిని రక్షించడానికి సహాయక చర్యలు జరుగుతుండగా కేంద్ర మంత్రి ,ఆయన భద్రతా సిబ్బంది రోడ్డు పక్కన కనిపిస్తున్నారు.

►ALSO READ | మారుతీ ఫస్ట్ మేడిన్ ఇండియా ఈవీ ప్రారంభించిన మోడీ.. e-VITARA స్పెషాలిటీస్ ఇవే..

X పోస్ట్‌లో మంత్రి వీడియోను షేర్ చేస్తూ ఇలా రాశారు. లడఖ్‌లోని ద్రాస్ సమీపంలో ఒక వాహనం మా కాన్వాయ్ కంటే కొంచెం ముందు నదిలో పడిపోయింది. అదృష్టవశాత్తూ మేము సమయానికి వచ్చాం.. ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. అని కిరణ్ రిజిజు రాశారు.