
e-VITARA: భారత ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలకు అందిస్తున్న ప్రోత్సాహంతో అనేక కంపెనీలు భారత అవసరాలతో పాటు విదేశాలకు ఎగుమతి చేసేందుకు ఎలక్ట్రిక్ కార్లు, ఈవీ స్కూటర్లను తయారు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మారుతీ సుజుకీ కంపెనీ తయారు చేసిన తొలి మేడిన్ ఇండియా ఎలక్ట్రిక్ SUV 'e-VITARA'ను ప్రధాని మోడీ జెండా ఊపి గుజరాత్‌లోని హన్సల్‌పూర్ లో ప్రారంభించారు. కంపెనీ దీనిని ప్రపంచ వ్యాప్తంగా 100 దేశాలకు ఎగుమతి చేయనుందని వెల్లడైంది. క్లీన్ అండ్ గ్రీన్ మెుబిలిటీకి భారత్ కేంద్రంగా మారటంపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు.
మారుతీ సుజుకీ e-VITARA ఈవీని తొలిసారిగా భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో ప్రదర్శించింది. జపాన్, యూరోపియన్ మార్కెట్లకు మారుతీ ఈ ఎలక్ట్రిక్ కార్లను ఎగుమతి చేయనుందని తేలింది. కంపెనీ ఈ కార్లను భారతదేశంలోని హన్సల్‌పూర్ ప్లాంట్ లో ఉత్పత్తి చేయనుందని వెల్లడించింది. కంపెనీ 2025 ఆర్థిక సంవత్సరంలో 3లక్షల 32వేల కార్లను ఎగుమతి చేయగా.. దేశంలో 19 లక్షల యూనిట్లను విక్రయించింది.
Today is a special day in India’s quest for self-reliance and being a hub for green mobility. At the programme in Hansalpur, e-VITARA will be flagged off. This Battery Electric Vehicle (BEV) is made in India and will be exported to over a hundred nations. In a big boost to our…
— Narendra Modi (@narendramodi) August 26, 2025
ప్రధాని మోడీ తన పర్యటనలో మారుతీ ఎలక్ట్రిక్ కారును ఇనాగరేట్ చేయటంతో పాటు డెన్సో, తోషిబా, సుజుకి సంస్థల జాయింట్ వెంచర్ TDS లిథియం- అయాన్ బ్యాటరీ ప్లాంట్‌లో హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్‌ల ఉత్పత్తిని మోడీ ప్రారంభిస్తారు. ఇదే క్రమంలో 65 కి.మీ. మహేసానా-పలన్‌పూర్ రైల్వే లైన్‌ను రూ.530 కోట్లతో డబ్లింగ్ పనులతో పాటు రూ.వెయ్యి400 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులను కూడా ప్రధాని ప్రారంభించారు.
e-VITARA ఎలక్ట్రిక్ కారు ప్రత్యేకతలు..
బ్యాటరీ సామర్థ్యం: 49 kWh, 61 kWh అనే రెండు ఆప్షన్లతో ఈవీ వస్తోంది.
మోటార్ పవర్: 141 bhp (49 kWh వేరియంట్), 171 bhp (61 kWh వేరియంట్).
టార్క్: 192 Nmకి సమీపంగా ఉంది.
రేంజ్: 49 kWh వేరియంట్ మైలేజీ సుమారు 400కిలోమీటర్లుగా ఉంగా.. 61 kWh వేరియంట్ మైలేజీ 500 కిలోమీటర్లుగా తెలుస్తోంది.
ఛార్జింగ్ సమయం: డీసీ ఫాస్ట్ ఛార్జర్ ఉపయోగిస్తే కారనును కేవలం 50 నిమిషాల్లో 0 నుంచి80 శాతం ఛార్జింగ్ చేయవచ్చని కంపెనీ చెబుతోంది.
సీటింగ్ కెపాసిటీ: 5 సీట్లు.
ఎలక్ట్రిక్ కార్ ధరలు: భారత మార్కెట్లో సుమారు రూ.17 లక్షల నుంచి రూ.22లక్షల50 వేల మధ్య ఉండనుందని ఆటో నిపుణుల అంచనా.
వేరియంట్స్: డెల్టా, జెటా, ఆల్ఫా అనే మూడు వేరియంట్లలో ఈవీ మార్కెట్లోకి వస్తోంది.
ఇతర ఫీచర్స్: కారులో 7 ఎయిర్ బాగ్స్, డ్యూయల్ డిజిటల్ స్క్రీన్స్, కనెక్టెడ్ కారు టెక్నాలజీ, LED లైట్స్, లెధరెట్ అప్‌హోల్స్టరీ, గ్లాస్ రూఫ్, 360 డిగ్రీ కెమెరా, లెవెల్ 2 ADAS వంటి ఫీచర్స్ అందించబడుతున్నాయి.