V6 News

Epic Teaser : 'బేబీ' జోడీ రిపీట్.. క్యూట్ రొమాన్స్‌తో ఆకట్టుకుంటున్న ఆనంద్ దేవరకొండ - వైష్ణవిల'ఎపిక్' టీజర్!

Epic Teaser : 'బేబీ' జోడీ రిపీట్.. క్యూట్ రొమాన్స్‌తో ఆకట్టుకుంటున్న ఆనంద్ దేవరకొండ - వైష్ణవిల'ఎపిక్' టీజర్!

టాలీవుడ్ సెన్సేషనల్ హిట్ 'బేబీ' చిత్రంతో యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న జోడీ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య . మరోసారి ఈ కపుల్ వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. వీరిద్దరూ జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్' (Epic - First Semester). లేటెస్ట్ గా ఈ చిత్రం టీజర్ ను మేకర్స్ రీలీజ్ చేశారు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.

'90s' ఆదిత్య స్టోరీకి స్పిన్-ఆఫ్..

ప్రముఖ వెబ్ సిరీస్ '90’s ఏ మిడిల్‌క్లాస్ బయోపిక్'తో భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు ఆదిత్య హాసన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆ సిరీస్‌లో రోహన్ రాయ్ పోషించిన 'ఆదిత్య' పాత్రకు ఇది స్పిన్-ఆఫ్ కావడం విశేషం. సిరీస్‌లో స్కూల్ కుర్రాడిగా కనిపించిన ఆ పాత్ర, ఇందులో లండన్‌లో షార్ట్ ఫిలిం మేకర్‌గా ఎదిగిన యువకుడిగా (ఆనంద్ దేవరకొండ) మనకు కనిపించనున్నారు. అక్కడ 'కడలి' అనే యువతితో (వైష్ణవి చైతన్య) అతను ప్రేమలో పడటం.. వారి మధ్య సాగే యూత్‌ఫుల్ అండ్ బ్రీజీ రొమాన్స్ ఈ చిత్ర కథాంశం.

టీజర్‌లో ఎలా ఉందంటే?
 

టీజర్ చాలా రిఫ్రెషింగ్‌గా, కలర్‌ఫుల్‌గా ఉంది. హేషమ్ అబ్దుల్ వాహబ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, అజీమ్ మహమ్మద్ విజువల్స్ సినిమాకు రిచ్ లుక్ ఇచ్చాయి. ముఖ్యంగా టీజర్ చివరలో వచ్చే కామెడీ సీన్ అందరినీ నవ్విస్తోంది. హీరో, హీరోయిన్ ఏకాంతంగా ఉన్న సమయంలో.. ఇండియా నుండి హీరో తండ్రి (శివాజీ) వీడియో కాల్ చేయడం, "షర్ట్ ఎక్కడరా?" అని అడగడం.. దానికి ఆనంద్ "ఎక్సర్సైజ్ చేస్తున్నాను నాన్న" అని కవర్ చేయడం భలే ఫన్నీగా ఉంది. తండ్రీకొడుకుల మధ్య ఉండే ఆ బాండింగ్‌ను మరోసారి ఆదిత్య హాసన్ అద్భుతంగా పండించినట్లు కనిపిస్తోంది.

భారీ అంచనాలతో..

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కల్ట్ లవ్ స్టోరీ 'బేబీ' తర్వాత వస్తున్న ఈ జోడీ సినిమా కావడంతో, ఇందులో కూడా ఏదైనా ఎమోషనల్ ట్విస్ట్ ఉంటుందా? అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు. ఈ 'ఎపిక్' కేవలం ఒక ప్రేమకథ మాత్రమే కాకుండా, ఫన్ అండ్ ఎమోషన్స్ కలగలిసిన పక్కా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా నిలిచేలా కనిపిస్తోంది. మరి ఈ 'ఫస్ట్ సెమిస్టర్'లో ఆనంద్-వైష్ణవి జోడీ ఎలాంటి మార్కులు కొట్టేస్తుందో చూడాలి!