నాసిక్‌‌‌‌లో ఎపిరోక్ కొత్త యూనిట్‌‌‌‌

నాసిక్‌‌‌‌లో ఎపిరోక్ కొత్త యూనిట్‌‌‌‌

హైదరాబాద్​, వెలుగు: గనుల తవ్వకం, మౌలిక సదుపాయాల రంగాలకు సేవలు అందించే ఎపిరోక్ మహారాష్ట్రలోని నాసిక్‌‌‌‌లో కొత్త ఉత్పత్తి, ఆర్‌‌‌‌అండ్‌‌‌‌డీ కేంద్రాన్ని ప్రారంభించింది. ఇది నాసిక్‌‌‌‌లోని ఇప్పటికే ఉన్న యూనిట్‌‌‌‌కు అదనం. ఈ కొత్త కేంద్రం ద్వారా భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు, పరిష్కారాలను అందించడమే లక్ష్యమని సంస్థ వెల్లడించింది. 

ఈ కొత్త కేంద్రంలో మైనింగ్, నిర్మాణ రంగాలకు సంబంధించిన భూగర్భ, ఉపరితల యంత్రాలను అభివృద్ధి చేస్తారు. ఇందులో ఉత్పత్తి కేంద్రం, ఆర్‌‌‌‌ అండ్‌‌‌‌ డీ ల్యాబ్, కార్యాలయాలు, పరికరాల టెస్ట్ ట్రాక్ ఉంటాయి.  కార్యకలాపాలు 2026 మూడో క్వార్టర్‌‌‌‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఎపిరోక్​ తెలిపింది.