అందుకే చేరుతున్న..బీఆర్ఎస్లో చేరికపై ఏపూరి సోమన్న క్లారిటీ..

అందుకే చేరుతున్న..బీఆర్ఎస్లో చేరికపై ఏపూరి సోమన్న క్లారిటీ..

బీఆర్ఎస్ పార్టీలో చేరికపై గాయకుడు, ఉద్యమకారుడు ఏపూరి సోమన్న క్లారిటీ ఇచ్చారు. తాను ఎందుకు బీఆర్ఎస్ లో చేరవల్సి వచ్చిందో ఓ వీడియో ద్వారా వివరించారు. 9 ఏళ్ల  కేసిఆర్ అభివృద్ధి చూసి.. తెలంగాణకు కేసిఆర్ పాలనే శ్రీ రామ రక్ష అని భావించి తాను బీఆర్ఎస్ లో చేరినట్లు ఏపూరి సోమన్న తెలిపారు. ఇక నుంచి తన ఆట, పాట అంతా బీఆర్ఎస్ పార్టీలో, తెలంగాన అభివృద్ధిలో భాగంగా ఉంటుందన్నారు. తన అభిమానులు, తోటి కళాకారులు, ప్రజల కోరిక మేరకే బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. 

నన్ను వెంట తిప్పుకుని..ఏపూరి సోమన్న వ్యాఖ్యలు..

నేను రాజకీయంగా ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నా. గత 24 ఏండ్లుగా ప్రజా ఉద్యమాల్లో ప్రజల కోసం ఆడి పాడిన నేను..నా ఆటను పాటను మరింత ముందుకు తీసుకుపోయే ప్రయత్నంలో తెలంగాణ ప్రజల హక్కులను కాపాడుతూ..వారి పరిరక్షణ కోసం పనిచేయాల్సిన బాధ్యతగా..ఈ రోజు వారి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని చెప్పి...నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత 2 సంవత్సరాలుగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో నాకు ప్రాధాన్యత ఇచ్చి...2 ఏండ్లుగా ఒక లీడర్ గా నన్ను గుర్తించి..నన్ను వెంట తిప్పుకుని..వైఎస్ఆర్టీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ప్రకటించిన వైఎస్ షర్మిలకు నా నమస్కారాలు. 

కోపంతోని..నిందలు వేయాలని..

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా..నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. నేను ఎవరి మీద కోపంతోనో..నిందలు వేయాలనో నా ఉద్దేశం కాదు. 9 ఏండ్లుగా కేసీఆర్ ప్రభుత్వాన్ని  చూసిన ప్రజలు..కేసీఆర్ అయితేనే..మాకు సరైన నాయకుడు అని ప్రజల్లో విశ్వాసం..నమ్మకం  ఇంకా ఉన్నది. అది బలంగా ఉన్నది కనుక..వారి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి జరుగుతుందని నమ్మకంతో, విశ్వాసంతో..నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక నుంచి ఆట, పాట, మాట తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం అయితుందని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. నన్ను అభిమానించే అభిమానులు, స్నేహితులు, సహచరుల సలహాల మేరకే..నేను ఈ నిర్ణయం తీసుకున్నాను.  షర్మిలమ్మ ఎక్కడున్నా... ఆడబిడ్డగా గౌరవిస్తాం. కమిట్ మెంట్ లీడర్. ఇక నుంచి నా ప్రయాణం బీఆర్ఎస్ లో కొనసాగుతాను. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామిని అవుతాను.