వచ్చే ఏడాది పాత కరెంటు చార్జీలే

వచ్చే ఏడాది పాత కరెంటు చార్జీలే

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలోని విద్యుత్‌‌‌‌  సంస్థలకు సంబంధించిన కరెంటు చార్జీలు యధాతథంగా వచ్చే ఆర్థిక సంవత్సరం కొనసాగుతాయని ఈఆర్‌‌‌‌ఎసీ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యుత్‌‌‌‌  సంస్థలు కరెంటు చార్జీలపై ఈఆర్‌‌‌‌సీకి  ఏఆర్‌‌‌‌ఆర్‌‌‌‌  టారిఫ్‌‌‌‌ ను నిరుడు నవంబరు నెలాఖరుకే సమర్పించాల్సి ఉంది. కానీ, విద్యుత్‌‌‌‌ సంస్థలు ఏఆర్‌‌‌‌ఆర్‌‌‌‌  నివేదికలు ఇవ్వలేదు.

ఈ నేపథ్యంలో డిస్కంల వినియోగదారుల కరెంటు చార్జీలు, ఫిక్స్‌‌‌‌డ్‌‌‌‌, ట్రాన్స్‌‌‌‌కో, జెన్‌‌‌‌కో, సెస్‌‌‌‌లకు సంబంధించిన వీలింగ్‌‌‌‌ చార్జీలన్నీ  ఇంతకు ముందున్నట్లు యధాతథంగా కొనసాగుతాయని ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ ఉత్తర్వులు జారీచేసింది. విద్యుత్‌‌‌‌   సంస్థలు తదిపరి ఏఆర్‌‌‌‌ఆర్‌‌‌‌  నివేదిక సమర్పించే వరకు ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది. దీంతో  2023–24 తరహాలోనే 2024–25 ఆర్థిక సంవత్సరంలో చార్జీలు కొనసాగనున్నాయి. అలాగే రాష్ట్ర  ప్రభుత్వం అమలు చేస్తున్న గృహజ్యోతి పథకం  జీరో బిల్లింగ్‌‌‌‌  విధానానికి సైతం ఈఆర్‌‌‌‌సీ ఆమోద ముద్ర వేసింది.