కేసీఆర్ కుడి భుజం ఈటల.. కులం పేరుతో మంత్రి కాలేదు

కేసీఆర్ కుడి భుజం ఈటల.. కులం పేరుతో మంత్రి కాలేదు

తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో కోర్వి కృష్ణ స్వామి ముదిరాజ్ 126 వ జయంతి వేడుకలు నిర్వహించారు. విశ్వేశ్వరయ్య భవన్ లో ముదిరాజ్ ప్రజా ప్రతినిధులకు సన్మానించారు. మంత్రులు ఈటెల రాజేందర్, ఎర్రబెల్లి దయాకరరావు, రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్ , పలు సంఘాల నేతలు హాజరయ్యారు.

కులం పేరు మీద మంత్రులు ఎమ్మెల్యే లు అయిన వారు ఎవరూ ఆ కులాలకు ఏమీ చేయడం లేదన్నారు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కులం పేరు మీద ఈటల రాజేందర్ మంత్రి కాలేదనీ.. ఉద్యమకారుడుగా ఈటల రాజేందర్ కు మంత్రి పదవి వచ్చిందని అన్నారు. సీఎం కుడి భుజంగా ఈటల రాజేందర్ కు మంచి పేరు వచ్చిందన్నారు.

రూ.1000 కోట్ల తో ముదిరాజ్ లకు వెహికల్ స్కీం, టూ వీలర్ స్కీమ్ ను తీసుకువచ్చామన్నారు బండప్రకాశ్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో బీసీ డీ నుంచి.. ముదిరాజ్ లను బీసీ ఏ లో చేర్చారనీ.. కొంత మంది కుట్ర చేసి..మళ్లీ బీసీ ఏ నుంచి తొలగించారని అన్నారు. బీసీ డీ నుంచి ముదిరాజ్ లను బీసీ ఏలో చేర్చేవరకు పోరాటం సాగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 5 ఏండ్ల లో  750 పెద్దమ్మ తల్లి టెంపుల్ లు కట్టించిందన్నారు. ముదిరాజ్  యువత  బలమైన శక్తి గా ఎదగాలనీ.. ప్రతి కమ్యూనిటీ హల్ లో వృత్తి, నైపుణ్య, శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలో  అంతర్జాతీయ ముదిరాజ్ మహా సభ ఏర్పాటు చేస్తామన్నారు.