కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలి : మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు

కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలి : మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు

రాయపర్తి, వెలుగు: కార్యకర్తలు సైనికుల్లా పని చేసి, పార్టీ బలపర్చిన అభ్యర్థిని గెలిపించాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు పిలుపునిచ్చారు. గురువారం ఆయన వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని బంధనపల్లి, ఏకే తండా, గట్టికల్, కొండాపురం, సన్నూర్, దుబ్బతండా, వెంకటేశ్వరపల్లి, జయరాం తండా(కే), ఎర్రకుంట తండా, జింకురాం తండాల్లో బీఆర్​ఎస్​ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు. 

ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి పలు గ్రామాల్లో ప్రచారం జోరుగా సాగింది. కార్యక్రమం బీఆర్ఎస్ మండల ఎన్నికల ఇన్​చార్జి గుడిపూడి గోపాల్ రావు, పార్టీ మండలాధ్యక్షులు మునావత్ నరసింహ నాయక్, మాజీ ఎంపీపీలు జినుగు అనిమి రెడ్డి, ఎనగందుల యాకనారాయణ, మాజీ జడ్పీటీసీ రంగు కుమార్ గౌడ్, ఎస్టీ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూక్య సురేందర్ రాథోడ్ నాయక్, చిన్నాల లక్ష్మీనారాయణ, యాకయ్య, లేతాకుల రంగారెడ్డి, ఎద్దు రమేశ్, మాలోతు వసుంధర్ తదితరులు పాల్గొన్నారు. 

పార్టీలో చేరికలు..

వర్ధన్నపేట (ఐనవోలు) : బీఆర్​ఎస్​ పార్టీలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు సమక్షంలో పలువురు చేరారు. హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలోని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ పీఎసీఎస్​ చైర్మన్ తండా వెంకన్న, పుల్యాల రాజిరెడ్డి, మాజీ పీఎసీఎస్ డైరెక్టర్, నడ్డగుడి సతీశ్, ఐనవోలు మాజీ ఉప సర్పంచ్, కొత్తూరి రాజు మాజీ వార్డ్ నెంబర్, బొల్లపల్లి రాజేశ్​గౌడ్, బొల్లపెల్లి మల్లేశ్​గౌడ్, చాగంటి యాదగిరి, తాళ్లపెల్లి రాజు, అలుగునూరి రవి, అలుగునూరి శివ ప్రసాద్, మెరుగు రవీందర్, ఇతర నాయకులు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకొన్నారు. 

కార్యక్రమంలో ఐలవోని మండలాధ్యక్షుడు తంపుల మోహన్, మండల బీఆర్ఎస్​ వర్కింగ్ ప్రెసిడెంట్ చందర్ రావు, మండల స్థానిక ఎన్నికల ఇన్​చార్జి రాంమూర్తి పోలపల్లి, ఇన్​చార్జి గోపాల్ రావు, మాజీ సర్పంచ్ సురేశ్​ తదితరులున్నారు.