తప్పుడు ప్రచారాలతో ప్రజలను మోసం చెయ్యొద్దు : ఎర్రబెల్లి

తప్పుడు ప్రచారాలతో ప్రజలను మోసం చెయ్యొద్దు : ఎర్రబెల్లి

కాళేశ్వరం ప్రాజెక్టుపై మాట్లాడటానికి కాంగ్రెస్ నేతలకు సిగ్గుండాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. ప్రాజెక్టుపై భట్టి విక్రమార్క, ఇతర  కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తప్పుడు ప్రచారం చేస్తూ.. ప్రజలను మోసం చేయొద్దని అన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు, విమర్శలు చేస్తే గ్రామాల్లో ప్రజలు తరిమికొడతారన్నారు.

కాంగ్రెస్ హయాంలో మొదలుపెట్టిన  ఏ ఒక్క ప్రాజెక్టు ముందుకు సాగలేదని ఎర్రబెల్లి అన్నారు. ప్రాజెక్టుల కోసం వారు తవ్విన కాల్వల్లో.. తుమ్మచెట్టు మొలిశాయని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో భూసేకరణ పై కోర్టుల్లో స్టేలు తెచ్చి కాలువల పనిని ఆలస్యం చేసింది కాంగ్రెస్ వాళ్లు కాదా? అని ఎర్రబెల్లి ప్రశ్నించారు. ఎస్సార్ ఎస్పీలో నీళ్లు రాకపోవటానికి కారణం కాంగ్రెస్సెనని ఆయన అన్నారు.

ప్రాజెక్టు విషయంలో 95శాతం రైతులను ఒప్పించామన్న ఎర్రబెల్లి.. మిగతా 5శాతం మంది రైతులతో, రైతులు కానీ వాళ్ళతో కాంగ్రెస్ ధర్నాలు చేయించిందని ధ్వజమెత్తారు. ఇన్ని ఆటంకాలు ఎదురైనా…కేవల మూడేళ్ళలో కాళేశ్వరం పూర్తిచేసిన మహాత్ముడు సీఎం కేసీఆర్ అని ఎర్రబెల్లి దయాకర్ అన్నారు.